Begin typing your search above and press return to search.
సుజనాచౌదరిని చూస్తే ఆ సామెత గుర్తుకు వస్తుంది!
By: Tupaki Desk | 6 Aug 2019 8:49 AM GMTమొన్నటి వరకూ చంద్రబాబును మించిన వీరుడు - శూరుడు లేడని - వివిధ సందర్భాల్లో ప్రజలను కూడా కించపరిచి - బ్యాంకులకు అప్పులను ఎగ్గొట్టిన వ్యవహారాల్లో సీబీఐ - ఈడీల విచారణను సైతం ఎదుర్కొన్న సుజనా చౌదరి ఇప్పుడు చాలా నీతులే చెబుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలోకి చేరి ఈయన పుణీతుడు అయిపోయాడు.
అనైతికమైన ఫిరాయింపుతో ఎంపీగా కొనసాగుతూ ఉన్న సుజనా చౌదరి కామెడీగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడి అనుమతితోనే సుజనా చౌదరి బీజేపీలోకి చేరారు అనే మాటా వినిపిస్తూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈయన మాట్లాడుతూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషిగా కొనసాగుతున్న సుజనా చౌదరి ఏపీ ప్రభుత్వాన్ని - ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శలు రాజకీయం కొద్దీ చేసేవి. అయితే ఈయన గారు మరో మాటా చెప్పారు. అదేమిటంటే.. ప్రపంచబ్యాంక్ రుణం ఇవ్వకపోవడం గురించి. అమరావతికి ప్రపంచబ్యాంకు రుణాన్ని నిరాకరించే అంశం గురించి సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.
నల్లగురివింద తన నలుపు ఎరగనట్టుగా సుజనా చౌదరి మాట్లాడారని అంటున్నారు పరిశీలకులు. బ్యాంకులకు లోన్లను ఎగ్గొట్టిన వ్యవహారాల్లో కేసులను ఎదుర్కొంటున్న సుజనా చౌదరి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణం గురించి మాట్లాడుతున్నారు.
ఈయన తమకు డబ్బులు ఎగ్గొట్టారని మారిషస్ బ్యాంకు ఒకటి కేసులను కొనసాగిస్తూ ఉంది. ఇంకా ఇతర విచారణలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. తనకు సంబంధించిన లోన్లను సరిగా పే చేయకుండా కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పుడు ఇలా రుణాల గురించి మాట్లాడటం ప్రహసనంగా మారిందని - తన చరిత్రను బట్టి సుజనా చౌదరి మాట్లాడితే బాగుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.