Begin typing your search above and press return to search.

సుజ‌నాచౌద‌రికి సుప్రీంకోర్టు షాక్‌

By:  Tupaki Desk   |   1 Sep 2015 1:02 PM GMT
సుజ‌నాచౌద‌రికి సుప్రీంకోర్టు షాక్‌
X
టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సుజ‌నా చౌద‌రి సుజ‌నా ఇండ‌స్ర్టీస్ గ్రూపున‌కు చెందిన స‌బ్సిడ‌రీ సంస్థ హైస్టియా కంపెనీకి గ‌తంలో మారిష‌స్ బ్యాంకు అప్పు ఇచ్చింది. అయితే ఈ రుణాన్ని స‌కాలంలో హైస్టియా కంపెనీ తిరిగి చెల్లించ‌లేద‌ని ఈ మొత్తానికి గ్యారెంట‌ర్‌గా ఉన్న సుజ‌నా ఇండ‌స్ర్టీస్‌ ను లిక్విడేట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని మారిష‌స్ బ్యాంకు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదోప‌వాద‌న‌ల అనంత‌రం సింగిల్ జ‌డ్జి కోర్టు సుజ‌నా ఇండ‌స్ర్టీస్‌ ను లిక్విడేట్ చేసేందుకు అనుమ‌తిస్తూ తీర్పు చెప్పింది.

సింగిల్ జ‌డ్జి తీర్పును స‌వాల్ చేస్తూ సుజ‌నా ఇండ‌స్ర్టీస్ స‌ర్వోన్న‌త‌ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. సుజ‌నా ఇండ‌స్ర్టీస్ వేసిన పిటిష‌న్‌ పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ఈ పిటిష‌న్‌ ను డిస్మిస్ చేసింది. అప్పు ఇచ్చిన వాళ్లు సివిల్ కోర్టుల్లో దావా వేయండం ద్వారా సొమ్ము రాబ‌ట్టుకునే హ‌క్కు క‌లిగి ఉన్నార‌ని కూడా ధ‌ర్మాస‌నం త‌న తీర్పులో పేర్కొంది. అలాగే గ్యారెంట‌ర్ సంస్థ హామీ ఉన్నా సొమ్ము చెల్లించ‌కుండా మారిష‌స్ బ్యాంకును నిరుత్సాహ ప‌ర‌చ‌డం త‌గ‌ద‌ని కూడా కోర్టు చెప్పింది.

ఈ చ‌ర్య వ‌ల్ల అంత‌ర్జాతీయ కంపెనీల‌తో ప‌లు ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండియా కంపెనీలు కూడా నిబంధ‌న‌లు, ఒప్పందాల అమ‌లుకు క‌ట్టుబ‌డి ఉండ‌క‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని కూడా హెచ్చ‌రించింది. సుజ‌నా చౌద‌రి కంపెనీకి వ్య‌తిరేకంగా గ‌త ఏప్రిల్‌ లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్న‌త న్యాయ‌స్థానం స‌మ‌ర్థించ‌డంతో పాటు సుజ‌నాచౌద‌రి వేసిన పిటిష‌న్‌ ను తిర‌స్క‌రించింంది. సుప్రీం తీర్పుతో సుజ‌నా కంపెనీకి పెద్ద ఎదురు దెబ్బే త‌గిలిన‌ట్ల‌య్యింది.