Begin typing your search above and press return to search.
2014లో జగన్ సీఎం కాకపోవడానికి కారణమిదే
By: Tupaki Desk | 1 Oct 2019 6:01 AM GMT2014లో గెలుస్తాడనుకున్న వైసీపీ అధినేత జగన్ ఎందుకు ఓడిపోయాడన్నది ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చకొస్తున్న ప్రశ్న. దానికి తాజాగా బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ 2014లో ఓటమికి గల ప్రధాన కారణాన్ని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు..
‘2014 ఎన్నికల సమయంలో జగన్ గెలుస్తాడని అంతా భావించారు. ఎన్నికల వాతావరణం కూడా జగన్ కు అనుకూలంగా ఉంది.. కానీ బీజేపీ - జనసేన పార్టీలు టీడీపీతో కలవడం వల్లే జగన్ పార్టీ ఓడిపోయింది’’ అని సుజనా చౌదరి విశ్లేషించారు. టీడీపీకి బీజేపీ - జనసేన మద్దతివ్వడం వల్ల గెలిచిందన్నారు.
అదే 2019కి వచ్చేసరికి టీడీపీ ఒంటరిగా పోటీచేయడం.. పవన్ కళ్యాణ్ విడిగా పోటీచేయడం.. బీజేపీ మద్దతు లేకపోవడంతోనే టీడీపీ చిత్తుగా ఓడిందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
తాను బీజేపీతో దోస్తీ కటీఫ్ చేయవద్దని చంద్రబాబుకు ఎంత చెప్పినా వినలేదని సుజనా చౌదరి వాపోయారు. ఒకవేళ టీడీపీ ఈసారి గెలిచినా తాను టీడీపీలో ఉండేవాడిని కాదని.. బీజేపీలో చేరేవాడినని స్పష్టం చేశారు. చంద్రబాబుకు బీజేపీతో వైరమే కొంప ముంచిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో మోడీషాల నేతృత్వంలో అభివృద్ది బాగా జరుగుతోందని సుజనా చెప్పుకొచ్చారు.