Begin typing your search above and press return to search.

అమరావతికి ‘కేంబ్రిడ్జ్’ వెలుగు

By:  Tupaki Desk   |   13 Sep 2016 4:58 AM GMT
అమరావతికి ‘కేంబ్రిడ్జ్’ వెలుగు
X
సీమాంధ్రుల ఆశలకు నిలువెత్తు రూపమైన అమరావతిలో ఒక ప్రతిష్ఠాత్మక సంస్థ రానుంది. దేశంలో మరెక్కడా లేని ఒక కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాయం ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ కార్యాయలంతో పాటు.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా కేంబ్రిడ్జ్ వర్సిటీ అధికారులతో కలిసి కేంద్రమంత్రులతో కలిసి ఏపీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి.. ఏపీ మంత్రి గంటా.. ఎంపీ రవీంద్రబాబులు భేటీ అయ్యారు.

కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంబ్రిడ్జ్ వర్సిటీతో ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఇందులో భాగంగా కేంబ్రిడ్జ్ సంస్థను అమరావతిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిధులు సేకరించేందుకు కేంబ్రిడ్జ్ వర్సిటీ సెక్షన్ 8 కంపెనీని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లుగా సుజనా వెల్లడించారు. అక్టోబరు 15న ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా చెప్పారు. కేంబ్రిడ్జ్ తో సహా ఉన్నత విద్యా ప్రమాణాలున్న సంస్థల్ని ఏర్పాటు చేసి.. విద్యార్థుల్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దటమే ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పిన సుజనా.. ఏపీలోని వర్సిటీల వీసీల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అవకాశం ఉన్న అన్ని రంగాల్లో కొత్త తరహా విధానాల్ని తీసుకొచ్చేందుకు కేంబ్రిడ్జ్ పని చేస్తుందని.. ఈ ఒప్పందం ఏపీకి ఎంతో గొప్ప అవకాశంగా సుజనా అభివర్ణించారు.