Begin typing your search above and press return to search.
మిస్టర్ చౌదరీ.. అలా ఎలా చేస్తారు?
By: Tupaki Desk | 29 July 2016 2:27 PM GMTఏపీ ప్రత్యేక హోదా అంశంపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు మోడీ సర్కారును.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని వెనకేసుకొచ్చి.. పొగడ్తల మీద పొగడ్తలతో ముంచెత్తిన నేపథ్యంలో వచ్చిన నెగిటివ్ టాక్ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు టోన్ మార్చారు. ఏపీ ప్రత్యేక హోదా మీద చర్చ షురూ అయిన వెంటనే కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి గళం విప్పే ప్రయత్నం చేశారు.
‘‘మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు కేంద్రమంత్రి’’ అంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదే పదే ప్రస్తావించటం గమనార్హం. అలా అని.. సుజనా చౌదరి మరీ అంత ఘాటుగా రియాక్ట్ అయ్యింది లేదు. కేంద్రం వైఖరిని తప్పు పడుతూనే.. అలా అని తన మాటలు ఎక్కడా మితిమీరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ కిందామీదా పడ్డారు. ఆయన అవస్థ చాలా స్పష్టంగా అర్థమైంది.
కాకుంటే.. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన తన పరిధిని కాస్త దాటారనే చెప్పాలి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా మీద సమాధానం ఇస్తూ ప్రసంగిస్తున్న వేళ.. మధ్యలో కల్పించుకొని ఏపీకి జరిగిన కేటాయింపుల మీద ఆయన జైట్లీ వ్యాఖ్యల్ని విభేదించటం కనిపించింది. ఈ సందర్భంగా కురియన్ కల్పించుకుంటూ.. మిస్టర్ చౌదరి.. ఇది చాలా అన్ యూజవల్.. మీరు ప్రభుత్వంలో భాగం. మీరు కేంద్రమంత్రి.. మీరు ఇలా వ్యవహరించటం ఏమిటి? అంటూ వ్యాఖ్యలు చేయటం కనిపించింది. అయినప్పటికీ ఆ మాటల్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించిన సుజనా చౌదరి.. జైట్లీ వ్యాఖ్యలకు మధ్యలో అడ్డుపడటం కనిపించింది.