Begin typing your search above and press return to search.
సుజనా చౌదరి.. టీడీపీ అంటే ఎంత ప్రేమో!
By: Tupaki Desk | 21 Jun 2019 10:22 AM GMTఒకవైపు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు. అయితే తెలుగుదేశం పార్టీ పై మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ విషయాన్ని వారే చెప్పుకుంటున్నారు. సుజనా చౌదరి అయితే ఈ విషయంలో ఓపెనప్ అయిపోయారు. తాము తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరినా.. తమ ప్రేమంతా తెలుగుదేశం పార్టీకే అని ఆయన ప్రకటించేసుకున్నారు.
తెలుగుదేశం నుంచి బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన సుజనా చౌదరి ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. 'తెలుగుదేశం పార్టీని బాగుపడాలని, మళ్లీ బలోపేతం కావాలని కోరుకుంటున్న వాళ్లలోనే నేనే ముందుంటాను. టీడీపీ బాగుకోరే తొలి వ్యక్తి నేనే..' అని చౌదరి ప్రకటించుకున్నారు.
ఇదీ కథ. ఈ నలుగురు ఎంపీలూ బీజేపీ మీద ప్రేమతో వెళ్లలేదు, మోడీ నాయకత్వంలో పని చేయాలని వెళ్లలేదు వీళ్లు చంద్రబాబు నాయుడు పంపిస్తేనే వెళ్లారు.. అనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మాటలు అసలు విషయాన్ని అర్థం అయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఫిరాయించిన తాము ఎందుకు బయటటకు వెళ్లినట్టో వివరించాల్సింది. అయితే వీళ్లు అలాంటి పని ఏమీ పెట్టుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీ బాగును కోరే వాళ్లలో తామే ముందున్నామని తేల్చి చెబుతూ ఉన్నారు. తద్వారా వీళ్లు తెలుగుదేశం పార్టీ బాగు కోసమే బీజేపీలోకి చేరామన్నట్టుగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే టీజీ వెంకటేష్ కూడా అసలు కథను వివరించారు. వారం కిందటే బీజేపీలోకి చేరే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినట్టుగా ఆయన తెలిపారు. దానికి చంద్రబాబు నాయుడు పెద్దగా అభ్యంతరం చెప్పినట్టుగా కూడా టీజీ చెప్పలేదు. తన పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరడం చంద్రబాబుకు కచ్చితంగా ఆమోదమే.. ఇందులో ఎలాంటి సందేహం లేదనే వాదనకు ఆ ఫిరాయింపు ఎంపీలేమరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు ఈ మాటలతో! ఇంకా ఈ పొలిటికల్ గేమ్ ను ప్రజలు అర్థం చేసుకోలేరా? అని పరిశీలకులు అంటున్నారు!