Begin typing your search above and press return to search.
సుజనా ఎందుకలా వ్యహరిస్తున్నారు?
By: Tupaki Desk | 16 March 2015 9:06 AM GMTక్రమశిక్షణ గల టీడీపీలో ఈ మధ్య లుకలుకలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న కార్యకర్తల వంటి వారు ఏం చేసినా అది లెక్కలోకి రాదు కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నవారు ఇలాంటి చర్యలకు కారణమైతే అలాంటివి జీర్ణించుకోవడం పార్టీ శ్రేణులకు కష్టమే. తాజాగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యవహారశైలి పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.
ఢిల్లీలో ఉన్న ప్రతినిధులు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు పలవురు మంత్రులు, ఎంపీలు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిలో సుజనా చౌదరి కొంత క్రీయాశీలంగా వ్యవహరిస్తూ పలువురు కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. మంచి పనేగా ...సమస్యేంటి అనుకోకండి. ఇక్కడే అసలు మతలబు ఉంది. కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు సహచర టీడీపీ ఎంపీలను సుజనా చౌదరి వెంట తీసుకెళ్లడం లేదట. పదే పదే ఇలా జరుగుతుండటంతో ఢిల్లీలోని ఆ పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల సుజనా చౌదరి ఏపీకి ప్రత్యేక హోదా కష్టమే అని అన్నారు. ఇది మరింత చిచ్చుకు కారణం అయింది. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రే ఆ విధంగా వ్యతిరేక ప్రకటన చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలాఉండగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సుజనా ఈ మధ్యకాలంలో చాలా సన్నిహితంగా మూవ్ అవుతున్నట్లు టీడీపీ భావిస్తోంది. అవసరానికి మించి వారితో దోస్తీ కొనసాగిస్తున్నారని వారు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఆయన వ్యాపార అవసరాల కోసమే ఆ విధంగా ఉంటున్నారా లేదా ఏమైనా రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయ అనే కోణంలోనూ టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. సుజనా చౌదరికి దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే.