Begin typing your search above and press return to search.

స్పెష‌ల్‌ పై మ‌రో బాంబు పేల్చిన సుజ‌నా

By:  Tupaki Desk   |   7 Sep 2016 8:58 AM GMT
స్పెష‌ల్‌ పై మ‌రో బాంబు పేల్చిన సుజ‌నా
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలా? ప‌్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా? అనే అంశాల్లో కేంద్రం నుంచి ఓ స్ప‌ష్టత వ‌చ్చేసినా.. టీడీపీ ఎంపీ - కేంద్ర మంత్రి సుజ‌నా తాజ‌గా ఇచ్చిన ట్విస్ట్‌ తో మ‌ళ్లీ స్పెష‌ల్‌ పై స‌స్పెన్స్ మ‌రింత పెరిగిపోయింది. ఈ రోజు ఏదో ఒక‌టి చెప్పేస్తుంద‌ని కేంద్రం ప్ర‌క‌ట‌న‌కోసం ఏపీ స‌హా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పింది. నిన్న‌మొన్న‌టి దాకా సుజ‌నా కూడా ఈ ప‌లుకులే వ‌ల్లించారు. ఇంత‌లో ఏపీలో రాజుకుంటున్న పొలిటిక‌ల్ వేడిని గ‌మ‌నించారో ఏమో ఇంత‌లో బుధ‌వారం ఉద‌యాన్నే.. ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ద్ద‌ని తాము క‌రాఖండీగా కేంద్రానికి స్ప‌ష్టం చేశామ‌ని, హోదాపై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని, సాయంత్రానికి ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని ఆయ‌న మ‌రో బాంబు పేల్చారు.

దీంతో మొత్తంగా అంద‌రికీ మైండ్ బ్లాంక్ అయింది. ఇంత‌లో మీరు అర్జంటుగా రావాలంటూ.. సుజ‌నాయే చంద్ర‌బాబుకు ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. ఏపీకి సంబంధించి కేంద్ర ఈరోజు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని, ఈ స‌మ‌యంలో మీరు ఢిల్లీలో ఉండ‌డ‌మే మంచిద‌ని ఆయ‌న స‌జెస్ట్ కూడా చేశార‌ట‌. అయితే, వెళ్లాలా వ‌ద్దా అనే సందేహంలో ప‌డిపోయార‌ట చంద్ర‌బాబు. అందుబాటులో ఉన్న మంత్రులు - సీనియర్లతో చర్చలు జరుపుతున్న‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే - ఏపీ విష‌యంలో సుజ‌నా మ‌రో భారీ బాంబు పేల్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంద‌ని, అయితే, దీనిపై ఏపీ ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో హోదా ఇస్తే.. ఎలా ఉంటుంది? అనే అంశంపై చ‌ర్చిస్తోంద‌ని సుజ‌నా మీడియాతో అన్నారు.

హోదా గ‌నుక ఇస్తే ఎలాంటి స‌మ‌స్య‌లూ రావ‌ని భావిస్తే.. దానిని ఇచ్చేందుకు కేంద్రం వెనుకాడ‌బోద‌న్న సుజ‌నా.. ఈ విష‌యాన్ని కేంద్ర పెద్ద‌లు.. ఎండీసీ(మంత్రుల బృందానికి) పంపాల‌ని, దీనిపై సూచ‌న‌లు స‌ల‌హాలు కోరాల‌ని భావిస్తోంద‌న్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఏపీ విష‌యంలో నిర్ణ‌యం మ‌రింత జాప్యం జ‌రిగే అవకాశం ఉంటుంద‌న్నారు. అంటే ఈ ఏడాది ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డే ఛాన్స్ లేద‌ని సుజ‌నా స్ప‌ష్టం చేశారు. కానీ, కేంద్రం అలాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేద‌ని గ‌తంలో కేంద్రం నుంచి అందిన సంకేతాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఏదేమైనా.. ఏపీ ప్ర‌త్యేక హోదా లేదా ప్యాకేజీ విష‌యం లో కేంద్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం. దీనికి మ‌రికొన్ని గంట‌ల్లో దీనికి తెర‌ప‌డే ఛాన్స్ ఉందంటున్నారు.