Begin typing your search above and press return to search.
అబ్బే..అశోక్, సుజనాల మధ్య గ్యాప్ లేదట
By: Tupaki Desk | 20 Sept 2016 3:56 PM ISTఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం - ప్రత్యేక హోదాపై చర్చలు జరిగినప్పుడు తెలుగుదేశం తరఫున చురుకుగా కనిపించిన ఏకైక వ్యక్తి సుజనా చౌదరి. మరో కేంద్ర మంత్రి - తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ ప్రతి సందర్భంలోనూ ఆయనకంటే జూనియర్ ఇంకా చెప్పాలంటే సహాయమంత్రిగా ఉన్న సుజనా చురుకైన పాత్ర పోషించారు. దీనిపై రకరకలా చర్చలు సాగాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఒక న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
ఏపీకి ప్రత్యేక సాయం చర్చల్లో గజపతిరాజును దూరంగా పెట్టారనే వార్తల్లో ఎటువంటి వాస్తవమూ లేదని సుజనా చెప్పుకొచ్చారు. ఆయన సీనియర్ మంత్రి అని పేర్కొంటూ అందరూ గౌరవిస్తారని అన్నారు. ఏపీకి సాయంపై గజపతిరాజు కూడా చాలా ప్రయత్నాలు చేశారని - గత రెండు సంవత్సరాలుగా ఆయన చాలా మీటింగ్ లలో పాల్గొన్నారని సుజనా చౌదరి తెలిపారు. అయితే ప్రకటన విడుదలయ్యే సమయంలో ఢిల్లీలో లేరని - అందుకే ఆయన ఈ చర్చల్లో పాల్గొనలేదని సుజనా వివరించారు. అంతే తప్ప తాను ఎప్పుడూ ఆయన్ని దూరంగా పెట్టలేదని - అశోక్ గజపతిరాజు అంటే తనకెంతో గౌరవమని చెప్పారు.