Begin typing your search above and press return to search.
సుజనా చౌదరి..మరీ ఇంత కామెడీగా మాట్లాడేస్తున్నారేంటి!
By: Tupaki Desk | 22 Oct 2019 1:30 AM GMTచేసిందే ఫిరాయింపు.. ఆ ఫిరాయింపుకు రాజముద్ర ను అయితే వేయించుకున్నారు. కానీ జనం మాత్రం దాన్ని ఫిరాయింపు అనే అనుకుంటున్నారు. అయితే తన గురించి జనాలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని గమనించకుండా సుజనా చౌదరి మాట్లాడుతున్న తీరును చూస్తుంటే.. మళ్లీ అదే జనాలు నవ్విపోతున్నారు! అలా ఉంది రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీరు!
ఇంతకీ ఈయన ఏమంటారంటే.. 'వైఎస్ - చంద్రబాబుల వల్లనే తెలుగు రాష్ట్రాలు ఇలా తయారయ్యాయి. వారి వల్లనే ప్రాంతీయ విబేధాలు తలెత్తాయి. తీవ్రమైన అవినీతి చేశారు..' అంటూ సుజనాచౌదరి మాట్లాడారు. ఈ మాటలపై సోషల్ మీడియాలో మరీ దారుణంగా స్పందిస్తున్నారు జనాలు. సుజనా చౌదరి మరీ ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారా? అంటూ అక్కడ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
మొన్నటి వరకూ చంద్రబాబుతో అతి సన్నిహితంగా నడుచుకున్నారీయన. ఇక ఈయన అవినీతి గురించి మాట్లాడమే మరో పెద్ద ప్రహసనం. రాజధాని భూముల కుంభకోణంలో సుజనా చౌదరి పై బోలెడన్ని ఆరోపణలు వచ్చాయి. తనకు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి లేదని ఈయన చెప్పుకున్నారు. ఆ తర్వాత ఒక పత్రిక వాళ్లు సుజనా చౌదరి బినామీలపై వందల ఎకరాల భూమి ఉందంటూ ప్రత్యేక కథనాన్నే ఇచ్చారు. అయితే ఆ కథనం తర్వాత ఈయన రాజధాని అంశం గురించి మాట్లాడలేదు.
ఇప్పుడేమో 'చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి జరిగింది..' అంటూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు బినామీ అనే ఆరోపణలు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న.. చంద్రబాబు నాయుడి అనుమతితోనే బీజేపీలోకి చేరారు. అనే విమర్శలను కూడా ఎదుర్కొంటున్న సుజనా చౌదరి ఇప్పుడు చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని విశ్లేషకులు కూడా అంటున్నారు.
మొన్నటి వరకూ తెలుగుదేశంలో ఉండి.. చంద్రబాబును పొగుడుతూ, భజన చేసి.. రాష్ట్ర ప్రజలను కూడా కించపరిచేలా మాట్లాడారు సుజనాచ చౌదరి. ఇప్పుడేమో బీజేపీలోకి చేరి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మరీ ఇన్ని ఊసరవెల్లి వేషాలను వేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితాన్ని గమనిస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కూడా సుజనా చౌదరి లాంటి వాళ్లు బీజేపీలోకి వెళ్లి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తే జనాలకు ఎక్కడో కాలవచ్చు అని కూడా పరిశీలకులు అంటున్నారు!