Begin typing your search above and press return to search.

బాబు జమిలీ డైలాగ్ పై..సుజనా సూపర్ కౌంటర్..

By:  Tupaki Desk   |   11 Sep 2019 4:50 PM GMT
బాబు జమిలీ డైలాగ్ పై..సుజనా సూపర్ కౌంటర్..
X
గ‌త కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరో మూడేళ్ళలోనే దేశవ్యాప్తంగా ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకో పార్టీ ఒకోలా స్పందిస్తుంది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన జమిలీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. రివర్స్ టెండరింగ్‌కు బదులు రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రివర్స్ పాలన ఉన్నా రివర్స్ ఎన్నికలకు ఎలాగూ ఆస్కారం లేదు. కానీ జమిలీ ఎన్నికలకు అవకాశం ఉందని, జమిలీ వస్తే మూడేళ్ళలో ఎన్నికలు వస్తాయని అన్నారు.

ఇక చంద్రబాబు వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జమిలీ ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని అన్నారు. అలాగే పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తే, ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ కాలయాపన జరగడం వల్ల ట్రాక్‌ తప్పిందని సుజనా పేర్కొన్నారు. అయితే మొన్నటి వరకు టీడీపీలో ఉంటూ చంద్రబాబుకు సన్నిహితుడుగా ఉన్న సుజనా ఈ రేంజ్ లో కౌంటర్ ఇవ్వడం ఓ రకంగా ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.

టీడీపీలో రాజ్యసభ సభ్యుడై, ఏ రకంగా పార్టీలో కీలక పాత్ర పోషించారో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎన్డీయే పెద్ద‌ల‌తోనూ బాగా సాన్నిహిత్యం సంపాదించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సీట్లు కేటాయింపు కూడా సుజనానే చూసుకున్నారు. అయితే ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో సుజనా బీజేపీలోకి జంప్ కొట్టారు. ఇక అక్కడ నుంచి తాను చెప్పినట్లు టీడీపీ అధిష్టానం వినలేదని, బీజేపీతో పొత్తు తెంచుకోవద్దని చెప్పానని అయిన చంద్రబాబు వినలేదని..అందుకే పార్టీ ఓడిపోయిందని విమర్శలు కూడా చేశారు. ఇక ఇప్పుడు జమిలీ ఎన్నికలపై మాట్లాడే అర్హత లేదంటూ..బాబుని తక్కువ చేసి మాట్లాడేశారు.