Begin typing your search above and press return to search.
హోదా లేనట్లే.. ప్యాకేజీతోనే ఊరడింపు
By: Tupaki Desk | 2 Sep 2016 4:42 AM GMTఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకే కేంద్రం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే 6వ తేదీన ప్యాకేజీని ప్రకటించే అవకాశాలున్నాయి. ప్యాకేజీలో హోదా స్థాయి ప్రయోజనాలుంటాయని కేంద్రం చెబుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కోసం రాష్ట్రానికి విడుదల చేసే నిధుల్లో 60కి బదులుగా 90 శాతాన్ని కేంద్ర ప్రభుత్వ వాటాగా పరిగణించడం, సత్వర పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహకాల కోసం సుమారు వెయ్యి కోట్లతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం వంటి నూతన ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి తుదిరూపమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ప్రత్యేక ఆర్థిక సహాయం - పారిశ్రామికాభివృద్ధికి పన్నుల రాయితీలు - రాజధాని- అమరావతి నగర నిర్మాణానికి నిధులు - పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు - విభజనానంతరం తొలి ఏడాది రెవిన్యూ లోటును భర్తీ చేసే విషయంలో మాత్రం కేంద్రం ఇప్పటికే తీసుకొన్న నిర్ణయాలకే కట్టుబడి వ్యవహరించనున్నట్లు సమాచారం.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో భరించాల్సిందేనని స్పష్టం చేసిన ప్రధాని మోడీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన తర్వాత ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి చెల్లించడానికి బదులుగా దానిని రాష్ట్ర వాటగా సర్దుబాటు చేసేందుకు అంగీకరించిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెబుతున్నారు. దీని ఫలితంగా నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ఇకపై వెచ్చించే నిధుల్లో తొంభై శాతాన్ని కేంద్రమే భరించినట్లవుతుందని ఆయన చెబుతున్నారు. సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు నాబార్డ్ నుండి తీసుకొనే రుణాన్ని కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని కూడా సుజనా చౌదరి ప్రకటించారు. దీంతో ప్యాకేజీ డీటెయిల్సు దాదాపుగా ఖరారయ్యాయని.. టీడీపీ ప్రభుత్వం అంగీకరించిందని కూడా అర్థమవుతోంది.
రాష్ట్రంలో బాగా వెనుకబడిన ఏడు రాయలసీమ - ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల అభివృద్ధికి ఏడాదికి రు.350 కోట్ల చొప్పున అందజేస్తున్న గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక ఆర్థిక సహాయం అయిదేళ్లకు బదులుగా ఆరేళ్లపాటు కొనసాగనుంది. పారిశ్రామికాభివృద్దికి ప్రోత్సాహకాలను ప్రకటించాలన్న విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం ఇప్పటికే గత రెండేళ్లుగా అమలు చేస్తున్న పదిహేను శాతం అదనపు పెట్టుబడి అలవెన్సు - పదిహేను శాతం అదనపు తరుగుదల అలవెన్సులు కొనసాగుతాయని, వీటికితోడు ఆదాయపు పన్ను ఇకముందు జిఎస్ టి పరిధిలోకి వెళ్తున్నందున పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేస్తారని సుజనా వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన ప్రోత్సాహకాలనివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిధిని నిర్వహిస్తుందని.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రు.250 కోట్ల వరకూ అందుబాటులో ఉండేలా రు.1250 కోట్లతో ఈ నిధి ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయని, దీనిపై కూడా రెండు - మూడు రోజుల్లో ఒక స్పష్టత లభిస్తుందన్న ఆయన ప్రత్యేక జోన్ ఏర్పడుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. చట్టంలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు - విజయవాడ - విశాఖపట్నం - తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం - ఎయిమ్స్ ఏర్పాటుకు తగినన్ని నిధులు - రేవు పట్టణాలను సాగర్ మాల ప్రాజెక్టులో చేర్చడం వంటి చర్యలతో కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తున్నదని చెప్పారు. విభజన హామీలలో కొన్ని శరవేగంతో పూర్తికాగా మరికొన్నింటి అమలులో జాప్యం జరుగుతున్నదని, వీటి కోసం పట్టుబడుతున్న తమకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా తమకు పదేపదే మద్దతుగా నిలుస్తున్నారని సుజనా చౌదరి చెబుతున్నారు. హోదాకు బదులుగా కేంద్రం ఇవ్వజూపుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల వ్యయంలో 60కి బదులు 90శాతాన్ని కేంద్ర వాటాగా పరిగణించడం వల్ల రాష్ట్రానికి ఏడాదికి సుమారు రు.2500 నుండి రు.3వేల కోట్ల వరకూ అదనంగా నిధులు సమకూరుతాయని, దీనితో ఎఫ్ ఆర్ ఎంబి మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు వేల కోట్ల రూపాయలను అదనపు రుణాలను సేకరించేందు కు వీలు కలుగుతుందని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.