Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదా మీద చౌద‌రి నోరు విప్పారే

By:  Tupaki Desk   |   29 May 2015 11:46 AM GMT
ప్ర‌త్యేక హోదా మీద చౌద‌రి నోరు విప్పారే
X
విభ‌జ‌న కార‌ణంగా పూర్తి స్థాయిలో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త‌శ‌క్తి తెచ్చేందుకు ఎంతో కీల‌క‌మైన ప్ర‌త్యేక‌హోదా మీద జ‌రుగుతున్న ర‌చ్చ అంతాఇంతా కాదు. ఈ అంశంపై విప‌క్షాలు విరుచుకుప‌డుతుంటే.. ఏపీ అధికార‌ప‌క్షం మాత్రం వ్యూహాత్మ‌క మౌనాన్ని ఆశ్ర‌యిస్తోంది. మ‌రోవైపు.. కేంద్రం త‌డ‌వ‌కో మాట చెబుతూ కాలం గ‌డిపేస్తోంది.

ఒకసారి ప్ర‌త్యేక‌హోదా కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెబుతూనే.. మ‌రోవైపు.. ప్ర‌త్యేక హోదా సాధ్యం కాద‌న్న మాట చెబుతూ..అయోమ‌యాన్ని సృష్టించ‌టం తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తారా? లేదా అన్న విష‌యంలో నెల‌కొన్న అయోమ‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఒక్క‌రూ ప్ర‌య‌త్నించ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక‌.. ఏపీ ప్ర‌త్యేక‌హోదా కోసం న‌టుడు శివాజీ నిజాయితీగా పోరాడుతుంటే.. ఏపీ విప‌క్షాలు మాత్రం అంతంత‌మాత్రంగానే స్పందిస్తున్నాయి. ప్ర‌ధాన విప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌త్యేక హోదా గురించి బ‌లంగా ప్ర‌స్తావించింది లేదు. ఇక‌.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌రంటూ నిర‌స‌న దీక్ష ఎందుకు చేయ‌ర‌న్న‌ది అర్థం కాని విష‌యం. ప‌లు అంశాల మీద నిర‌స‌న దీక్ష చేసే జ‌గ‌న్‌కు.. ప్ర‌త్యేక‌హోదా పెద్ద విష‌యంగా క‌నిపించ‌క‌పోవ‌టం శోచ‌నీయం.


ఇదిలా ఉంటే.. తాజాగా.. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా విష‌యంపై ఏపీ అధికార‌ప‌క్షం నేత‌లు పెద్ద‌గా ప్ర‌స్తావించ‌టం లేద‌న్న కొర‌త‌ను తీరుస్తూ.. కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి గ‌ళం విప్పారు. మ‌హానాడులో ప్ర‌సంగించిన ఆయ‌న‌.. రాష్ట్ర విభ‌జ‌న అప్ర‌జాస్వామికంగా జ‌రిగింద‌నే విష‌యం అంద‌రికి తెలుస‌న్న ఆయ‌న‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కాల‌యాప‌న జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదాకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామ‌ని చెప్పిన సుజ‌నా.. నిజంగా ఆ ప‌ని చేస్తున్నారో లేదో కానీ.. క‌నీసం ఆ అంశంపై ప్ర‌స్తావించ‌టమైనా చేశారు.