Begin typing your search above and press return to search.
సుజనా చౌదరికి ఇప్పటికి కళ్లు తెరుచుకున్నాయి..
By: Tupaki Desk | 8 Aug 2015 7:47 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ నాయకుల కంటే కూడా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఘంటాపథంగా చెప్పేవారు. బీజేపీ నేతలు ప్రత్యేక హోదా రాదు అని స్పష్టంగా చెబుతున్నా కూడా ఏపీ ప్రజల ముందుగా అడ్డగోలుగా వాదిస్తూ ప్రత్యేక హోదా రావడం ఖాయం.. ఫైలు అక్కడుంది, ఇక్కడుంది... ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుంది అని చెప్పే సుజనా కూడా తాజాగా హోదా మాట పక్కనపెట్టేశారు. ప్యాకేజీ బాట పట్టేశారు. ఎప్పుడూ 'ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుంది' అని చెప్పే సుజనా ఈసారి ఆంధ్రప్రదేశ్ కు తప్పకుండా ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది' అని చెప్పడం విశేషం.
ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తాజాగా సుజనా వెల్లడించారు. కృష్ణా జిల్లా అగిరపల్లిలో మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలసి ఆయన మాట్లాడుతూ.. నిపుణుల కమిటీతో చర్చించాక హోదాపై స్పష్టత వస్తుందని.. అంతవరకు ఆగాలని అన్నారు. ఆలోగా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి సుజనా చౌదరికి ఇన్నాళ్లకు తత్వం బోధపడినట్లుగా ఉంది.