Begin typing your search above and press return to search.
సుజనాకు అర్థమైన ‘‘యాగం’’
By: Tupaki Desk | 27 Dec 2015 9:20 AM GMTకేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. కేంద్రసహాయమంత్రి సుజనా చౌదరి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. గడిచిన నాలుగురోజులుగా అయుత చండీయాగం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. ఆ యాగం వార్తల్ని సుజనా చదివారో లేదో అన్నది అర్థం కాని పరిస్థితి. చండీయాగాన్ని ఆయన పెద్దగా ఫాలో అయినట్లుగా లేదన్న విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న చండీయాగం రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన యాగం చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేసీఆర్ నోటి నుంచి మాట వరసకు కూడా రాని మాటను కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న సుజనా నోటి నుంచి రావటం కాస్త చిత్రమైన విషయంగా చెప్పాలి.
యాగం గురించి ప్రకటించిన నాటి నుంచి తెలంగాణ క్షేమం కోసం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా చండీయాగం చేస్తున్నట్లుగా పలుమార్లు చెప్పటం తెలిసిందే. అందుకు భిన్నంగా సుజనా మాత్రం.. యాగం చేస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో అని చెప్పటంపై విస్మయం వ్యక్తమవుతోంది. కార్యక్రమం నిర్వహిస్తున్న వారి నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే బాగుంటుంది కానీ.. కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. అది అటు తెలంగాణ ప్రజలకు.. ఇటు సీమాంధ్రప్రజలకు ఇబ్బందే. అందుకే.. సుజనా లాంటి వారు మాట్లాడేటప్పుడు కాస్తంత ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. పక్కింట్లో పెళ్లి.. మనింటి పెళ్లి కాదన్న విషయం సుజనాకు ఎందుకు అర్థం కాదంటూ సీమాంధ్రకు చెందిన పలువురు తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.