Begin typing your search above and press return to search.
సుజనా డీల్ బాబుకు షేమ్ ఫుల్ కాదా?
By: Tupaki Desk | 1 Sep 2016 4:06 PM GMT'లోపల మీటింగులో కూర్చుని బయటకు వచ్చేలోగా చంద్రబాబునాయుడు గారు పదిసార్లు ఫోన్ చేశారు' అంటూ నిన్న సుజనా చౌదరి ఢిల్లీలో సెలవిచ్చారు. ఆయన చెప్పిన స్టయిలు చూస్తే.. 'అబ్బో వీరిద్దరూ కలిసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేయడానికి ఎంతలావు కసరత్తు చేస్తున్నారో కదా' అనిపిస్తుంది. నిన్నంతా అలాగే అనిపించింది. తీరా తెల్లారే సరికి హోదా విషయం అనుమానమే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. సాయంత్రానికి సుజనా చౌదరి ప్రెస్ మీట్ పెట్టి ఈ రెండు మూడు రోజులుగా ఢిల్లీలో తాను పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అయి సాధించిందేమిటో వివరించారు.
విషయాలకు ఆయన ఎన్ని రకాలుగా అయినా రంగులు పూసి చెప్పి ఉండొచ్చు గానీ.. ప్లెయిన్ గా చాలా షేమ్ ఫుల్ డీల్ కుదిరినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకహోదా సంగతి దేవుడెరుగు.. సుజనా మాటలను బట్టి.. విశాఖపట్టణం రైల్వేజోన్ సంగతి కూడా కేంద్రం ఒప్పుకోలేదు. నిన్నటిదాకా ఇప్పుడు జోన్ ప్రకటించేసి - దానికి ఇవ్వాల్సిన నిధులు వచ్చే ఏడాది బడ్జెట్ లో ఇస్తారని అనుకున్నారు. కానీ ఇవాళ కనీసం అది కూడా లేదు. పోలవరం - వెనకబడ్డ ప్రాంతాలకు నిధుల విషయంలో సుజనా ఈ భేటీల వల్ల కొత్తగా సాధించిన పాయింటు ఏమీ కనిపించడం లేదు అనేది జనంలో ఉన్న అభిప్రాయం.
నిన్నటి వరకు ఉన్న పరిస్థితికి ఇవాళ్టికి తేడా ఏంటంటే.. కోర్ కేపిటల్ లో ప్రభుత్వ భవనాల నిర్మానానికి కేంద్రం డబ్బు ఇవ్వాల్సి ఉండగా - ఇప్పుడు డీపీఆర్ లు పూర్తయితే తప్ప ఇచ్చేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఇది చంద్రబాబు సర్కారుకు మరీ అవమానకరమైన సంగతి అని అంతా అనుకుంటున్నారు. చంద్రబాబు చేజేతులా రాష్ట్రానికి దక్కవలసిన హక్కులను - వసతులను నాశనం చేసేస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.