Begin typing your search above and press return to search.

‘ముష్టి’ మీదా సిగ్గు లేని మాటలేనా సుజనా?

By:  Tupaki Desk   |   30 Jan 2017 6:27 PM GMT
‘ముష్టి’ మీదా సిగ్గు లేని మాటలేనా సుజనా?
X
ఏపీ అధికారపక్ష నేతల మాటలు వింటుంటే.. ఆంధ్రోడి రక్తం సలసలా మరిగిపోయేలా చేస్తోంది. నిండా ఆవహించిన అధికారమదంతో ఆయన మాటలు ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న ‘పంది పోటీలు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజానీకానికే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఎబ్బెట్టుగా తోచటమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి జరిగే నష్టం భారీ ఉంటుందని సుజనాకు క్లాస్ పీకినట్లుగా చెబుతారు.

ప్రత్యేక హోదా ఎపిసోడ్ లో చురుగ్గా వ్యవహరించినట్లుగా చెప్పే సుజనా.. తర్వాతి కాలంలో హోదాను వదిలేసి.. ప్రత్యేక ప్యాకేజీపై ఫోకస్ చేయటంలో కీలకభూమిక పోషించారు. హోదాది ఏముంది? అదిరిపోయే ప్యాకేజీ అని చెప్పుకునే తెలుగు తమ్ముళ్లు.. చివరకు దానికి చట్టబద్ధత లేని దుస్థితి. హోదా స్థానే ముష్టి లాంటి ప్యాకేజీని తీసుకురావటం ఒక ఎత్తు అయితే.. దాన్నిగొప్పగా చెప్పుకునేటప్పుడు తాము చెబుతున్న ప్యాకేజీకి ఎలాంటి చట్టబద్ధత లేదన్న విషయాన్ని మర్చిపోవటం కనిపిస్తుంది.

ఇంతకాలం చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు సూటిగా సమాదానం చెప్పని స్థానే.. సుజనా ఇప్పుడు ఫిబ్రవరి 15 లోపు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత సాధించి తీరుతామని చెప్పటం గమనార్హం. నియోజకవర్గాల పెంపు.. పోలవరం నిధులు.. రైల్వే జోన్ మీద పట్టుబడతామని చెబుతూ.. రాష్ట్రానికి ఏమేం రావాలో ఇప్పటివరకూ కష్టపడ్డామని.. ఇక మీదట వాటి కోసం తీవ్రంగా కృషి చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన మిగిలిన టీడీపీ ఎంపీలు ప్యాకేజీ చట్టబద్ధత ఇచ్చే విషయంలో కేంద్రం జాప్యం చేసిందన్న ప్రశ్నకు సుజనా సమాధానం చెప్పలేని పరిస్థితి. మోడీ సర్కారులో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న సుజనా.. ముష్టి లాంటి ప్యాకేజీ విషయంలో ఆయనగారి మాటలు వింటే.. మరీ ఇంత సిగ్గు లేని మాటలు ఏలా? అన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపిస్తున్నాయి. టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ప్యాకేజీ చట్టబద్ధత అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలన్న మాటను చూస్తే.. కేంద్రం పడేసిన ముష్టికి మండిపడకుండా.. దానికి చట్టబద్ధత కోసం మళ్లీ అడుక్కోనున్న తీరు చూస్తే.. కంపరం కలగక మానదు. ఏపీకి ఏదో గొప్ప ఫేవర్ చేసేశామని చెప్పేవెంకయ్య లాంటి వాళ్లు ముష్టి లాంటి ప్యాకేజీ చట్టబద్ధతకు అడ్డుపడుతున్న అంశాలు చెబితే బాగుంటుందని చెప్పకతప్పదు.