Begin typing your search above and press return to search.
కేసీఆర్ సమర్థుడు: టీడీపీ కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 11 Oct 2015 9:12 AM GMTకేసీఆర్ నియంత.. అరాచకవాది.. డిక్టేటర్.. ఆయనో హిట్లర్.. తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది. అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా చంద్రబాబుపై, మంత్రులపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి ఏపీ మంత్రులూ కూడా ధీటుగానే సమాధానమిచ్చారు. ఓటుకు నోటు తర్వాత ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంత చక్కబడుతున్నాయి.
తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. సురభి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుజనాచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమర్థుడని ప్రశంసించారు. అలాగే రాష్ట్రం విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు ప్రజల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు - కేసీఆర్ సమర్థులని కితాబిచ్చారు. తెలుగు ప్రజల సంక్షేమానికి ఇరువురూ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. సుజనాచౌదరి వ్యాఖ్యలపై టీడీపీలో ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన కేంద్రమంత్రి హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారా లేక వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేశారా అని పార్టీ నేతలు పలువురు గుసగుసలాడుకుంటున్నారు.