Begin typing your search above and press return to search.
సుజనా చౌదరి..బీజేపీలో చేరడమే తరువాయి..
By: Tupaki Desk | 18 Jun 2019 7:24 AM GMTఏపీలో టీడీపీ నుంచి బీజేపీ లోకి వెళ్లే పెద్ద వికెట్ సుజనా చౌదరేనని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయం ఫైనలైజ్ కానుందని సమాచారం. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని... చంద్రబాబుకు కూడా ఆయన సమాచారం పంపించారని తెలుస్తోంది.
పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే సుజనాకు చంద్రబాబు వరుసగా రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తూ వచ్చారు. అంతేకాదు.. గత మోదీ ప్రభుత్వంలో తెదేపా కలిసున్న కాలంలో సుజనాకు కేంద్ర మంత్రిగానూ అవకాశమిచ్చారు. అయితే.. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసిన తరువాత బీజేపీకి - మోదీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఎంతగా గొంతెత్తినా కూడా సుజనా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవారు. మోదీ - బీజేపీలను పెద్దగా విమర్శించేవారు కాదు.
తాజాగా సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు కారణంగానే టీడీపీ ఓటమి పాలైందని... ఆయన మనుషుల కంటే మిషన్లను నమ్ముకున్నారంటూ సుజనా ఆరోపించారు. బీజేపీలోకి వెళ్తారన్న ఊహాగానాలపై మాట్లాడుతూ వెళ్తే చంద్రబాబుకు చెప్పే వెళ్తానని అన్నారు. అంతేకానీ.. బీజేపీకి వెళ్లడం లేదని ఆయనేమీ ఖండించలేదు.
కాగా... సుజనాపై ఆర్థిక అవకతవకల కేసులు సీబీఐలో ఉన్నాయి. సీబీఐ కేసులు చుట్టుముడుతుండడం కూడా సుజనా బీజేపీ వైపు అడుగులు వేయడానికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత రాజ్యసభ టెన్యూర్ అయిపోయిన తరువాత సుజనాకు మళ్లీ కొనసాగింపు కావాలంటే టీడీపీలో ఉండగా అది అసాధ్యం. ఇవన్నీ ఆలోచించే ఆయన బీజేపీలో చేరికకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు గత రెండేళ్లుగా సుజనా బీజేపీతో సన్నిహితంగా ఉన్నారని టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది.