Begin typing your search above and press return to search.
పవన్..మీ అన్నను అడిగితే నిజాలు తెలుస్తాయి
By: Tupaki Desk | 28 Jan 2017 5:35 AM GMTఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీరును తప్పుపడుతూ అదే సమయంలో బీజేపీ - టీడీపీ నేతలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడటంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనాలు వదిలి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనపైనా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నో కంపెనీలు పెట్టాం, ఎంతో మందికి ఉద్యోగాలిచ్చామని పేర్కొంటూ తమ కంపెనీ ఎప్పుడూ అప్పులు ఎగ్గొట్టలేదన్నారు. ఆర్థిక నేరాలు వేరు - ఆర్థిక ఇబ్బందులు వేరని సుజనా వివరించారు. రాజకీయాలను అభివృద్దికి లింక్ పెట్టడం సరికాదని సుజనా చౌదరి పవన్ కళ్యాణ్ పై అసహనం వ్యక్తం చేశారు.
కాగా టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగబాబు పవన్ కళ్యాణ్ కు నేరుగా లేఖ రాశారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలు తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. తాము బడుగు - బలహీనవర్గాలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినట్టు.. రైతుల పొలాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఎకరాకు రూ.19.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి సంబంధిత అధికారుల అనుమతితోనే డంప్ యార్డు ఏర్పాటు చేశామని పవన్‌ని ఉద్దేశించి రాసిన లేఖలో రంగబాబు వివరించారు. తాము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నామే తప్ప పెంచుకోలేదని రంగబాబు వివరించారు. ఈ విషయం గురించి మీ సోదరుడు చిరంజీవిని అడిగితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక ముందు తమ కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పవన్ కల్యాణ్ ను రంగబాబు పరోక్షంగా హెచ్చరించారు.
మరోవైపు సౌమ్యుడిగా ఉండే బీజేపీ ఎమ్మెల్యే - ఏపీ మంత్రి మాణిక్యాలరావు సైతం పవన్ పై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సాయం అందిస్తోందని తెలిపారు. అయినప్పటికీ పవన్ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని మాణిక్యాల రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుటుంబం సారథ్యంలోని స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా 20వేల మంది యువత ఉపాధి పొందుతున్నారని, అలాంటి ట్రస్టుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ట్విట్టర్ లో పవన్ అభిమానులను రెచ్చగొట్టే ట్వీట్స్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాణిక్యాల రావు అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/