Begin typing your search above and press return to search.
సుజనా టార్గెట్ సీఎం కుర్చీయేనా?
By: Tupaki Desk | 14 July 2019 9:30 AM GMTటీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న బీజేపీ ఆకాంక్షలు తీర్చి - తానూ తన ఆకాంక్షను తీర్చుకోవాలన్న ఉద్దేశం సుజనా మాటల్లో కనిపిస్తోందన్న మాట అంతటా వినిపిస్తోంది.
విజయవాడలో ఈ రోజు బీజేపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన సుజనా చౌదరి.. ‘‘బీజేపీలో చేరకముందు నేను పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నాను. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే బీజేపీలో చేరాను’’ అని చెప్పారు.
బీజేపీలో చేరకముందు సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీ చేయకపోయనప్పటికీ రాజకీయంగా యాక్టివ్‌గానే ఉండేవారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన లేరనేలా ఎన్నడూ ఆయన రాజకీయ జీవితం లేదు. కానీ, సుజనా మాత్రం ఇప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. ఉన్నత స్థాయి సంబంధాలు - ధనం - పలుకుబడి అంతా ఉన్న సుజనా మాటల వెనుక రహస్యం సీఎం కుర్చీయేనంటున్నారు.
2014 ఎన్నికల ముందు టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదర్చడంలో తాను కీలక పాత్ర పోషించానని సుజనా చౌదరి చెప్పడం చూస్తుంటే.. తన స్థాయేంటే ఏపీ బీజేపీ నేతలకు చెప్పడమే తన ఉద్దేశమని.. సహజంగా వ్యాపారవేత్తయిన సుజనా ఏపీలో బీజేపీకి ప్రధాన ఫేస్ గా మారాలనుకుంటున్నారని.. టీడీపీలో ఉన్నప్పుడు తన ఫాలోవర్లనందరినీ కూడదీసి బీజేపీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లోఅధికారం అందుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.