Begin typing your search above and press return to search.

నిజ‌మేనా?: బీజేపీలోకి సుజ‌నా జంప్‌?

By:  Tupaki Desk   |   30 April 2018 6:41 AM GMT
నిజ‌మేనా?:  బీజేపీలోకి సుజ‌నా జంప్‌?
X
రాజ‌కీయాల‌న్నాక అంచ‌నాలు ఎన్ని వినిపిస్తుంటాయో.. పుకార్లు కూడా అంత‌కు మించిన అన్నట్లుగా వ‌స్తుంటాయి. అయితే.. తాజాగా వినిపిస్తున్న పుకారు ఏపీ అధికార‌ప‌క్షానికి షాకింగ్ గా మారింది. అంతేకాదు.. తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తున్న ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ.. ఆ విష‌యం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత క‌మ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు.. ఆయ‌న జానీ జిగిరి దోస్తానా.. బాబు ఆర్థిక వ్య‌వ‌హారాల్లో కీ రోల్ గా పేరున్న మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి పార్టీ మార‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఆయ‌న బీజేపీలో చేరే వీలుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే క‌మ‌లం పెద్ద‌ల‌తో సుజ‌నా ట‌చ్‌లో ఉన్నార‌ని.. మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నార‌ని.. ఇప్పుడు వినిపిస్తున్న అంచ‌నాలు నిజ‌మైతే బాబుకు భారీ షాక్ త‌ప్ప‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఈ పుకారుకు కాస్తో కూస్తో బ‌లం ఉన్న ఆధారం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రులు స‌భ్యులుగా ఉన్న ఎన్సీబీఎన్ వాట్సాఫ్ గ్రూపులో సుజ‌నా పార్టీ మార‌టంపై చిన‌బాబు లోకేశ్ రియాక్ట్ కావ‌టం.. వెయిట్ చే్ద్దామ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. సుజ‌నా బీజేపీలోకి మార‌తారంటూ గ్రూప్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు స్పందించిన లోకేశ్‌.. అలాంటి స‌మాచార‌మేమీ అంద‌లేదు.. వాస్త‌వం వెలుగోల‌కి వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూద్దామ‌న్న మేసేజ్ ను పోస్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక వేళ అదే నిజ‌మైతే.. బాబుకు భారీ దెబ్బ ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

బాబు గుట్టుమ‌ట్లు అన్నీ తెలిసిన సుజ‌నా కానీ బీజేపీ గూటికి చేరితే దారుణ‌మైన ఇబ్బంది త‌ప్ప‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ బాబుకు సుజ‌నాకు మ‌ధ్య‌నున్న రిలేష‌న్ ఎక్క‌డ తేడా కొట్టింద‌న్న‌ది విష‌యానికి వ‌స్తే.. నంద్యాల ఉప ఎన్నిక‌ను వాయిదా వేయించ‌టంలోనూ.. ప్ర‌ధాని మోడీతో అపాయింట్ మెంట్ ఇప్పించ‌టంలోనూ సుజ‌నా ఫెయిల్ అయ్యార‌ని. .అప్ప‌టి నుంచి ఆయ‌న తీరుపై బాబు కినుకుగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలు.. బీజేపీ పెద్ద‌లు సుజ‌నాతో ట‌చ్ లో ఉన్నార‌న్న వాద‌న‌లు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లాజిక్ గా చూస్తే.. సుజ‌నా బీజేపీలోకి వెళ్ల‌టం టీడీపీకి ఎంత న‌ష్ట‌మో. బాబును వీడిపోవ‌టం కూడా సుజ‌నాకు అంతే న‌ష్ట‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం చెప్ప‌గ‌ల‌దు.