Begin typing your search above and press return to search.
సుజనా చౌదరి , మరింతమందిని తీసుకెళ్తున్నారా?
By: Tupaki Desk | 21 Jun 2019 2:30 PM GMTభారతీయ జనతా పార్టీలోకి చేరడం మాత్రమే కాదు, అక్కడ తన వెయిట్ ను పెంచుకునేందుకు కూడా సుజనా చౌదరి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే సుజనా చౌదరి పై కేసులు గట్రా కూడా ఉన్నాయి. వాటిపై సీబీఐ విచారణ కొనసాగుతూ ఉంది. ఈడీ నుంచి ఆయనకు పిలుపులు కూడా అందాయి. ఇలాంటి క్రమంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరడమే కాకుండా ఆ పార్టీలోకి మరింత మందిని తీసుకెళ్లి తన సత్తా చూపించి బీజేపీ హై కమాండ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడట.
అందులో భాగంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలను సుజనా చౌదరి తనతో పాటు తీసుకెళ్లబోతూ ఉన్నాడని సమాచారం. కొందరితో ముందు నుంచినే సుజనా చౌదరి ఈ విషయంలో సంప్రదింపులు జరిపారని, మరి కొందరితో సంప్రదింపులు సాగుతూ ఉన్నాయి భోగట్టా.
అందులో భాగంగా సుజనా చౌదరి టచ్లో ఉన్న నేతల పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఈదర హరిబాబు.. వీళ్లిద్దరూ దాదాపుగా సుజనా చౌదరి వెంట నడవడం ఖరారు అయ్యిందని సమాచారం. వారికి చౌదరితో ముందు నుంచినే సన్నిహిత సంబంధాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వారు ఇప్పుడు బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇలాంటి వారిని తన వెంట తీసుకెళ్లి బీజేపీలోకి చేర్చడం ద్వారా అక్కడ తన పరపతిని కూడా పెంచుకోవచ్చని చౌదరి భావిస్తున్నట్టుగా సమాచారం. వీరిలో శ్రీరామ్ మాల్యాద్రిని సుజనా చౌదరే రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారంటారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ బాట పట్టడం ఖరారు అని టాక్ వినిపిస్తూ ఉంది. మొత్తానికి తను వెళ్లడం మాత్రమే కాకుండా చౌదరి మరింతమందిని వెంట తీసుకెళ్తున్నాడని స్పష్టం అవుతోంది.