Begin typing your search above and press return to search.

సుజ‌నా ప్ర‌త్యేక హోదా తెస్తార‌ట‌.ఎలా.ఎప్పుడు

By:  Tupaki Desk   |   25 Aug 2015 1:05 PM GMT
సుజ‌నా ప్ర‌త్యేక హోదా తెస్తార‌ట‌.ఎలా.ఎప్పుడు
X
ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా ఇవ్వ‌లేమ‌ని తేల్చేశాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కానీ మ‌న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి నే ఎటూ తేల్చ‌లేక‌పోతున్నాడు. వ‌స్తుందో రాదో అన్న విష‌య‌మై స్ప‌ష్ట‌మైన స‌మాధాన‌మేదీ ఇవ్వ‌లేక‌పోతున్నాడు. ఓ సారి వ‌స్తుంద‌ని... మ‌రో సారి రాద‌ని ఇలా పూట‌కో మాట వినిపించేస్తున్నాడు. ఇంత‌కీ ఏపీకి హోదా రావడం సాధ్య మా ? కాదా? ఇవాళ జైట్లీ పాత పాటే పాడాడు. నీతి ఆయోగ్ సూచ‌న‌లు మేర‌కు నిధులిస్తామ‌ని చెప్పేశాడు. అంతేకాదు అప్పుడెప్పుడో మ‌న్మోహ‌న్ ఇచ్చిన హామీ ఒక‌టుంద‌ని, దానికి ప్ర‌త్యామ్నాయం ఆలోచిస్తున్నామ‌ని చెప్పేశాడు. దీంతో మ‌న‌కొచ్చేదేంటో.... ఇచ్చేందేంటో తేలిపోయింది.ఇక తేల్చాల్సింది.పోరాడాల్సింది సుజ‌నాలాంటి ఎంపీలే.

నిన్న‌టికి నిన్న ఏపీకి ప్ర‌త్యేక హోదా రాద‌ని చెప్పిన ఆయ‌న ఈ రోజు ఉద‌యం బాబు మోడీతో భేటీ అయిన సంద‌ర్భంలో మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌త్యేక హోదా త‌థ్య‌మ‌ని చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాద‌ని స‌గ‌టు ప్ర‌జానికానికి కూడా అర్థ‌మైనా ఈయ‌న మాత్రం తెస్తాం..తెస్తాం అంటున్నారు. ఎలా తెస్తారు ? ఎప్పుడు తెస్తారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆయ‌న స‌మాధానం చెప్ప‌రు.

ఇది ప‌క్క‌న పెడితే కేంద్ర‌మంత్రిగా ఉన్న ఈయ‌న గారు ప్ర‌త్యేక ప్యాకేజీ అయినా ఎంత‌వ‌ర‌కూ సాధిస్తారు? ఎంత మొత్తంలో నిధులు తెస్తారు? అన్న‌ది కూడా య‌క్ష ప్ర‌శ్న‌లే! ఏపీకి వెంక‌య్య‌నాయుడు లాంటి పెద్ద డ్రామా ఆర్టిస్టు ఒక‌రున్నారంటూ సుజ‌నా రెండో డ్రామా ఆర్టిస్టు అన‌డంలో సందేహం లేద‌ని ఆయ‌న మాట‌లే చెపుతున్నాయి. ఇలాంటి పెద్ద‌మ‌నుషులు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌చి క‌నీసం ఏపీకి రావాల్సిన నిధుల గురించి పోరాడితే కాస్తైనా ప్ర‌యోజ‌నం ఉంటుంది.