Begin typing your search above and press return to search.
వామ్మో..తండ్రి పేరుతోనూ సుజనా లీలలు!
By: Tupaki Desk | 1 Dec 2018 7:56 AM GMTబ్యాంకులకు రూ.6 వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సంబంధించి తాజాగా ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సుజనా తన తండ్రి పేరులో స్వల్ప మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. పేరు మార్చడం ద్వారా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ వోసీ) నుంచి అక్రమ మార్గంలో డిన్ నంబర్లు పొంది డొల్ల కంపెనీలు సృష్టించినట్లు సమాచారం అందుతోంది.
కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం వివిధ కంపెనీల్లో డైరెక్టర్ గా చేరే వారికి ఆర్ వోసీ ఒక నంబర్ ను కేటాయిస్తుంది. దాన్ని డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్) అంటారు. డైరెక్టర్ కంపెనీ మారినా డిన్ నంబర్ మారదు. అతడు ఎన్ని కంపెనీల్లో ఉన్నా ఇట్టే తెలుసుకోవచ్చు. కంపెనీల చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే టిన్ కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉంటే కంపెనీల చట్టంలోని సెక్షన్ 266ఏ నిబంధనను అతిక్రమించినట్లే. దీనికి గరిష్టంగా ఆరునెలల జైలుశిక్ష లేదా రూ.5,000 లేదా ఈ రెండు కలిపి కూడా విధించే అవకాశముంటుంది.
సుజనా చౌదరి తన తండ్రి పేరును మార్చి రెండు టిన్ నంబర్లు తీసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సుజనా తండ్రి పేరు వై.జనార్ధన రావు. ఈ పేరు మీద టిన్ నంబర్ తీసుకున్నారు. అనంతరం జనార్ధన్ రెడ్డిగా తన తండ్రి పేరులో మార్పు చేసి.. ఆ పేరు మీద కూడా టిన్ నంబరు తీసుకున్నట్లు తెలిసింది. ఈ రెండు టిన్ నంబర్లకు ఒకే ఇంటి చిరునామా - ఒకే పాన్ నంబర్ ఉండటం గమనార్హం.
రెండు టిన్ నంబర్ల వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ కు చెందిన న్యాయవాదులు 2016 ఫిబ్రవరిలో ఆర్వోసీకి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత తెలుగు న్యాయవాది ఇమన్నేని రామారావు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్వోసీలో కదలిక వచ్చింది. సుజనా తండ్రికి రెండు టిన్ నంబర్లు ఉన్నట్లు వారి దర్యాప్తులో తేలింది. జనార్ధన రెడ్డి పేరు మీద 2006లో తీసుకున్న టిన్ ను ఈ ఏడాది సెప్టెంబర్ 15న రద్దు చేశారు. అయితే - ఒకసారి టిన్ జారీ చేస్తే అది జీవితకాలం ఉంటుందని - ఇలా ఎందుకు డియాక్టివేట్ చేశారో అర్థం కావట్లేదని చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రస్తుతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి ఈడీ దర్యాప్తులో సుజనా అక్రమాలు ఇంకెన్ని వెలుగుచూస్తాయోనని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.