Begin typing your search above and press return to search.
అమెరికా మెట్రో కండెక్టర్ గా..తెలుగమ్మాయ్
By: Tupaki Desk | 22 Nov 2017 9:18 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలోని మెట్రో రైలు విభాగంలో మన తెలుగమ్మాయి విధులు నిర్వహిస్తోంది! అయితే ఏంటి? ఎంతో మంది అక్కడ మనోళ్లు ఉద్యోగాలు చేస్తున్నారుగా?! ఈమె గొప్పేంటి? అని పెదవి విరుస్తూ.. నోరెళ్లబెడుతున్నారా?! ఇక్కడే ఉంది అసలు ట్విస్టు!! విషయంలోకి వెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గిడ్ల సుజాత బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆ తరువాత అమెరికాలో మాస్టర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవింది. అదయ్యాక అక్కడే ఓ బ్యాంకులో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా చేరింది. దీంతో ఆమెకు ఐదంకెల వేతనం అందుకునేది. అయితే, అనూహ్యంగా ఆమె మరో జాబ్‌లోకి మారాలని భావించింది.
ఈ క్రమంలోనే రోజూ ఆమె తాను పనిచేసే బ్యాంకుకు వెళ్లి వస్తున్న సబ్ వే ట్రయిన్‌లో లేడీ కండక్టర్ ను చూస్తే ఆమెకు ముచ్చటేసేది. తాను కూడా అలాంటి ఉద్యోగం చేస్తే.. ఎంత బాగుంటుందో అనుకునేది. మరి ఈ మట మహత్యమో ఏమోకానీ, సుజాత ఇలా అనుకున్న కొన్ని నెలల వ్యవధిలోనే ఆర్థిక సంక్షోభం రావడం, బ్యాంకులో ఉద్యోగం పోవడం జరిగిపోయాయి. ఇదిలావుంటే, ఒకరోజు పేపర్లో సబ్‌వే రైలు కండక్టర్ జాబ్ కోసం ప్రకటన వచ్చింది. దీంతో ఎగిరి గంతేసిన సుజాత దానికి దరఖాస్తు చేసింది. పరీక్ష కూడా రాసింది.
అయితే ఫలితాలు రాకమునుపే ఇల్లు మారిపోవడంతో ఆమె ఆ ఉద్యోగానికి ఎంపికైందన్న విషయం ఆమెకు తెలియలేదు. నిజానికి ఆ ఉద్యోగానికి సుజాత ఎంపికైంది. రైల్వే వాళ్లు ఆమె పాత ఇంటి అడ్రెస్ కు ఎన్నోసార్లు సమాచారం పంపించారు కూడా. కానీ, సుజాతకు తెలియలేదు. కొన్నాళ్లు గడిచిన తర్వాత సుజాత స్వయంగా తన ఉద్యోగం సంగతి ఏమైందో కనుక్కుందామని రైల్వే కార్యాలయానికి వెళ్లింది. దీంతో అక్కడి అధికారులు.. ఆమె కోసం చూసి చూసి విసిగిపోయామని, వేరే వాళ్లకు ఉద్యోగం ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిసి అవాక్కయింది. వారిని చాలా సేపు బ్రతిమాలి.. ఆ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది.
అలా 2009లో తాను కోరుకున్న ఉద్యోగంలో చేరింది సుజాత. మన దేశంలో రైల్వే గార్డ్ ఎలానో ఈ పోస్టూ అంతే.. అక్కడి మెట్రో రైలు మధ్యలో కండక్టర్లు ఉంటారు. ప్యాసింజర్స్ కి తలుపులు తెరవడం, మూయడం, స్టేషన్లు వచ్చేటప్పుడు అనౌన్స్‌మెంట్ ఇవ్వడం, ప్రయాణికులు జాగ్రత్తగా ఎక్కేలా, దిగేలా చూడడం ఇవీ ప్రధానంగా అమెరికా మెట్రో రైలు కండక్టర్ బాధ్యతలు. సబ్ వే రైలులో ఉద్యోగంలో చేరిన తొలిరోజుల్లో ప్రయాణికులు తనను కొత్తగా చూసేవారని, అక్కడ తొలి భారతీయ కండక్టర్ ని అని తెలుసుకుని అభినందించేవారని సుజాత పేర్కొంది. సబ్ వే రైలులో ఎన్నో దేశాల వారు ప్రయాణిస్తుంటారని, ఒక్కోసారి భారతీయులు కూడా కనిపిస్తుంటారని, అప్పుడు వాళ్లని చూస్తే తనకెంతో ఆనందం కలుగుతుందని సుజాత తెలిపింది.
తెలుగువారైతే ‘నమస్తే' అని.. తమిళంలో మాట్లాడుతుంటే ‘వణక్కం' అని, పంజాబీవాళ్లయితే ‘సస్రియాకాల్' అంటూ తాను అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంటానని, వారు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తుంటారని చెబుతోంది. ‘కండక్టర్‌గా అన్ని దేశాల వారితో కలిసి పనిచేస్తున్నాను. అందరితో మాట్లాడుతూ... వారి సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. మన సంస్కృతి గొప్పదనం వారికి చెప్పవచ్చు.. అదో ఆనందం..' అంటోంది సుజాత గిడ్ల.
కొంతమంది భారతీయులు ఆమెను చూసి.. ‘ఇంత చదువు చదువుకొని ఈ కండక్టర్ ఉద్యోగం ఏంటి? వేరేది చూసుకోవచ్చు కదా?' అని సలహా ఇచ్చేవాళ్లట. మరికొందరేమో.. ‘మరో ఉద్యోగం రాక ఇలాంటి ఉద్యోగం చేస్తున్నట్లుంది..' అంటూ చిన్నబుచ్చేవాళ్లట.
నిజానికి ఫలానా పని తక్కువ.. ఫలానా పని ఎక్కువ అనే ఆలోచనే తప్పంటుంది సుజాత. ఆ మాటకొస్తే అమెరికావాళ్లే నయం. వారికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసు. ఎంత ఉన్నత చదువులు చదివినా వారికిష్టమైన పనులు చేస్తుంటారు. బస్ డ్రైవర్ ఉద్యోగం - టీచర్ ఉద్యోగం - భవనాల కిటికీలు క్లీన్ చేసే ఉద్యోగాలు చేయడానికి కూడా వెనుకాడరు. మంచి ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా కూర్చోకుండా చిన్నాచితక పనులు కూడా చేస్తారు. కానీ కొంతమంది భారతీయులు మాత్రం కోరుకునే ఉద్యోగం వచ్చేంత వరకు ఖాళీగా కూర్చుంటారు అంటారు సుజాత. మన దేశంలో మాదిరిగా అమెరికాలో కుల వ్యవస్థ, అంటరానితనం లేవని చెబుతోంది సుజాత.
భారత్ మాదిరిగా తననెవరూ అమెరికాలో వేరుగా చూడరని చెబుతోంది. ఆమె తండ్రి ఇంగ్లీష్ లెక్చరర్ కావడంతో ఆయన ట్యూషన్స్ చెప్పేటప్పుడు విని ఆంగ్లం నేర్చుకుందట. తన ఇంగ్లీష్ ధాటి చూసి భారతీయులు తనది ఏదో అగ్రకులానికి చెందినదై ఉంటుందని భావించేవారట, తీరా ఆమె దళితురాలినని తెలియగానే దూరంగా వెళ్లిపోయే వారట. తాజాగా సుజాత గిడ్ల ఇంగ్లీష్ లో రచించిన ‘యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్' పుస్తకం ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. న్యూయార్క్ టైమ్స్ - బీబీసీ తదితర మీడియాల్లో దానిపై రివ్యూలు, ఇంటర్య్వూలు కూడా వచ్చాయి.
ఆ పుస్తకం విడుదలైన తరువాతే సుజాత అమెరికాలోని మెట్రో సబ్ వే లో పనిచేస్తున్న తొలి భారతీయ మహిళా కండక్టర్ గా అందరికీ తెలిసింది. అయితే తాను ఆ పుస్తకంలో కుల వ్యవస్థ గురించి, దళిత క్రైస్తవుల గురించి రాయడాన్ని అమెరికాలోని కొంతమంది భారతీయులు తప్పు పడుతున్నారని, ప్రపంచంలో ఏ మూలకెళ్లినా సంప్రదాయం, సంస్కృతి పేరిట తమతోపాటు తమ కులాలను కూడా తీసుకెళ్లి భద్రంగా కాపాడుకుంటున్న వారి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం అంటూ నవ్వేస్తారామె! మొత్తానికి కాకినాడ యువతి అమెరికా వెళ్లి ప్రపంచ స్థాయిలో మన్ననలు పొందడం నిజంగా గర్వకారణం అని చెప్పకతప్పదు!