Begin typing your search above and press return to search.
రాజద్రోహం కేసులో సుల్తానాకి ఊరట... ముందస్తు బెయిల్ మంజూరు !
By: Tupaki Desk | 17 Jun 2021 11:51 AM GMTకేరళ నటి, నిర్మాత అయిషా సుల్తానాకు హైకోర్టులో ఈరోజు ఊరట లభించింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ను ఉద్దశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇందులో అరెస్టు కాకుండా కేరళ హైకోర్టు ఆమెకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు అయిషా సుల్తానాకు ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. దీనితో ఆమె బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం విచారణకు హాజరుకావాలని, ఆమెను పోలీసులు కనుక అరెస్టు చేస్తే బెయిల్ పై విడుదల కావొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె రెగ్యులర్ బెయిల్ పై మాత్రం హైకోర్టు తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. లక్షద్వీప్ లో కరోనా వ్యాప్తికి కేంద్రం జీవాయుధం ప్రయోగించిందంటూ ఓ టీవీ ఛానల్ చర్చలో అయిషా సుల్తానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ జీవాయుధం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేలే అన్న అర్ధం వచ్చేట్టుగా ఆమె మాట్లాడారని పోలీసులు కేసు పెట్టారు. లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్ గా ప్రఫుల్ పటేల్ రాకముందు కరోనా కేసులు లేవని, ఆయన వచ్చాక ఏకంగా 9 వేల కేసులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. దీనితో పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు పెట్టారు. దీని పై ఆమె హైకోర్టును ఆశ్రయించగా, మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు అయిషా సుల్తానా వ్యాఖ్యల్ని లక్షద్వీప్ లో బీజేపీ సహా అన్ని పార్టీలు ఇప్పటికే సమర్ధించాయి. లక్షద్వీప్ లో సంస్కరణల పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ అమల్లోకి తెచ్చిన విధానాలపై అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రఫుల్ లక్షద్వీప్ కు విచ్చేసిన నేపథ్యంలో నిరసనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. చాలా చోట్ల జనం నల్లటి మాస్కులు ధరించి, వారి ఇళ్లపై నల్ల జెండాలను ఎగరేశారు. ప్రఫుల్ వ్యతిరేక నినాదాలిచ్చారు.