Begin typing your search above and press return to search.
సీఎంకు ముచ్చెమటలు పట్టిస్తున్న సుమలత!
By: Tupaki Desk | 25 March 2019 12:28 PM GMTకర్ణాటక సీఎం కుమారస్వామికి ఇప్పుడు తనయుడి విషయంలో తలపోటు తీవ్రం అయ్యింది. ఈ సారి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించే పనిలో ఉన్న కుమారస్వామికి సీనియర్ నటి సుమలత టెన్షన్ పెడుతూ ఉన్నారు. కుమారస్వామి తనయుడు పోటీ చేస్తున్న చోట సుమలత బలమైన అభ్యర్థిగా తయారు అయ్యింది. ఆమె రాజకీయ నేపథ్యాన్ని ఉపయోగించుకుని బీజేపీ కూడా అక్కడ కుమారస్వామికి ఝలక్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడ కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కు విజయావకాశాలు ప్రశ్నార్థకం అయ్యాయి.
అందుకే ఇప్పుడు కుమారస్వామి ఓపెనప్ అయిపోతూ ఉన్నారు. తన తనయుడిని ఓడించడానికి కుట్ర జరుగుతోందని కుమారస్వామి వాపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మండ్య ఎంపీ సీటు విషయంలో సుమలతకు తాము బేషరతు మద్దతును తెలుపుతున్నట్టుగా బీజేపీ ప్రకటించింది. కర్ణాటక బీజేపీ పెద్ద దిక్కు యడ్యూరప్ప కూడా ఈ విషయంలో స్పందించారు. దివంగత నటుడు అంబరీష్ భార్యకు తమ మద్దతు ఉందని ఆయన తెలిపారు.
ఇక నియోజకవర్గంలో అంబరీష్ కు ఉన్న ఫాలోయింగ్ మామూలు స్థాయిలో లేదు. క్యాస్ట్ ఈక్వెషన్స్ ప్రకారం చూసినా, సినిమా అభిమానం ప్రకారం చూసినా.. అంబరీష్ కు దిగ్విజయమైన ఫాలోయింగ్ ఉంది. అందులోనూ ఆయన ఇటీవలే మరణించారు. అభిమానులు ఆ బాధలోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సుమలత పట్ల విపరీతమైన సానుభూతి ఉంది. మండ్య ప్రాంతం జేడీఎస్ కు కూడా ఆటపట్టే. అయితే.. అంబరీష్ సానుభూతి పవనాలతో కుమారస్వామి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక వర్గం సుమలతకే సపోర్ట్ అంటోందట. పొత్తులో భాగంగా ఈ సీటు జేడీఎస్ కు దక్కడం ఇష్టం లేని కాంగ్రెస్ వారు సుమలతకే సపోర్ట్ అంటున్నారు. గతంలో అంబరీష్ కాంగ్రెస్ లో పని చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆ పరిచయాలు సుమలతకు సానుకూలంగా మారుతూ ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, మరోవైపు అంబరీష్ ఇమేజ్, ఇంకా సానుభూతి.. ఇలాంటి నేపథ్యంలో సుమలత పోటీ.. జేడీఎస్ నేతకు ఇరకాటంలో పడేసే అంశం అవుతోంది.