Begin typing your search above and press return to search.
బాబుకు షాక్...కన్నడ నేలలో అవమానం..ఆధిక్యంలో సుమలత
By: Tupaki Desk | 23 May 2019 6:59 AM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఓటమి ఖరారు కాగా..మరోవైపు జాతీయ స్థాయిలో ఆయన చేసిన షో కామెడీగా మారిపోతోంది. దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నకల ఫలితాలు ఇవాల వెలువడనున్న సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్ర మ్యాండ్యా నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు ఆయన మద్దతిచ్చారు. అయితే, ఆయన ఓటమి బాటలో ఉన్నారు.
మాండ్యాలో జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థి - కుమారస్వామి కుమారుడు నిఖిల్ కు మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి సుమలత బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ ఫ్యామిలీపై ప్రశంసలు గుప్పించిన చంద్రబాబు..నిఖిల్‌ను మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐతే సుమలతపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా..బీజేపీ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సుమలత 12 వందల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సీఎం కొడుకుని కాదని మాండ్య ప్రజలు సుమలతకు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.
మండ్య లోక్ సభ నుంచి గత మూడు సార్లు గెలిచిన అంబరీష్ గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా మండ్య నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని సుమలత గతంలో ప్రకటించారు. అయితే కాంగ్రెస్ జేడీఎస్ పొత్తులో భాగంగా మండ్య నియోజకవర్గం జేడీఎస్ కు కేటాయించింది కాంగ్రెస్. తర్వాత ఆమె బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె ఏ పార్టీలో చేరకుండా మండ్య నియోజకవర్గం నుంచి ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు.