Begin typing your search above and press return to search.
జాగ్వార్ హీరోకు, సుమలతకు పోటీ
By: Tupaki Desk | 4 March 2019 11:37 AM GMTసీనియర్ నటి, దివంగత కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఖైదీ, స్వయంకృషి, శుభలేఖ వంటి సినిమాల్లో ఆమె హీరోయిన్ గా తెలుగులో ఎంతో పేరుతెచ్చుకుంది.
అంబరీష్ ఇటీవలే మృతిచెందడంతో సుమలత ఒంటరిదయ్యింది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసినా అంబరీష్ మృతితో ఆయన రాజకీయ వారసత్వాన్ని సుమలత కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అంబరీష్ మృతితో ఆయన స్వస్థలమైన మాండ్యా నుంచి సుమలత బరిలోకి దిగాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇటీవలే సుమలత కూడా తాను వచ్చే ఎన్నికల్లో మాండ్యా నుంచి ఎంపీగా బరిలోకి దిగుతానని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మాండ్యా నుంచి బరిలోకి దిగుతానని.. ఇవ్వకున్నా స్వతంత్రంగానైనా పోటీచేస్తానని సుమలత ప్రకటించింది. అయితే మాండ్యా సీటుపై గతంలో జేడీఎస్ బరిలోకి దిగి గెలిచింది. ఈసారి కూడా మాండ్యా సీటు జేడీఎస్ కే పొత్తులో కేటాయించారట..
ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఎంపీగా పోటీచేయడానికి రెడీ అయ్యారట.. నిఖిల్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథనందించిన ‘జాగ్వార్’ మూవీలో హీరోగా నటించాడు. అనంతరం రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ మాండ్యా నుంచి ఎంపీగా పోటీచేసి గెలవడానికి రెడీ అయ్యారట.. ముఖ్యమంత్రి కుమారుడు కావడంతో ఆయనకు సీటు కన్ఫమే..
కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో ఈ సీటు జేడీఎస్ కేనని.. నిఖిల్ రాజకీయ ప్రవేశం కోసం మాండ్యా సీటునే సీఎం కుమారస్వామి ఎంచుకున్నారని తెలిసింది.
ఇప్పుడు సెంటిమెంట్ సీటు కోసం సుమలత.. మరోవైపు సీఎం కుమారుడు నిఖిల్ మాండ్యా సీటు కోసం పోటీపడుతుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సుమలత, నిఖిల్ లో సీటు ఎవరికి దక్కనుందనేది ఆసక్తిగా మారింది.