Begin typing your search above and press return to search.
సుమలత షాకింగ్ నిర్ణయం.. ఇక ఒంటరే..
By: Tupaki Desk | 7 Jun 2019 8:46 AM GMTసుమలత.. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ.. కర్ణాటక పాలిటిక్స్ అంతా ఈమె చుట్టే తిరిగాయి. దివంగత రెబల్ స్టార్ అంబరీష్ చనిపోవడంతో ఆయన స్థానంలో రాజకీయాల్లోకి వచ్చారు. మాండ్యా నుంచి లోక్ సభకు స్వతంత్ర ఎంపీగా పోటీచేశారు..
కాంగ్రెస్ టికెట్ ను సుమలతకు ఇవ్వకపోవడం.. పైగా ఈ సీటును సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కు పొత్తుల్లో ఇవ్వడంతో మాండ్యాలో టప్ ఫైట్ ను ఇచ్చారు సుమలత.. సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు ఎంత ప్రయత్నించినా సుమలతను ఓడించలేకపోయారు. అయితే ఇండిపెండెంట్ గా గెలిచిన సములతకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని.. ఆమె బీజేపీలో చేరితే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు చెలరేగాయి..
అయితే ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో సుమలతకు చాన్స్ దక్కలేదు.. ఆమె బీజేపీలో చేరలేదు. అయితే తాజాగా తాను ఇక బీజేపీ లో చేరేది లేదని సుమలత స్పష్టతనిచ్చారు. పార్లమెంట్ లో తాను ఇండిపెండెంట్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే అవకాశం లేదని తేల్చిచెప్పారు.. బీజేపీ కేంద్రమంత్రి ఆఫర్ ను ఇవ్వకపోవడంతోనే సుమలత ఈ నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా కర్ణాటకలో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడం.. కాంగ్రెస్ చతికిలపడడంపై సుమలత స్పందించారు. జేడీఎస్ తో పొత్తు కారణంగానే కాంగ్రెస్ మునిగిందని.. ఒంటరిగా పోటీచేసి ఉంటే కనీసం 10 ఎంపీ సీట్లను గెలిచి ఉండేదని సుమలత విశ్లేషించారు. రాష్ట్రంలో ప్రజాబలంతో బీజేపీ గెలవలేదని.. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు కారణంగానే ఓట్లు చీలి బీజేపీ గెలిచిందని సుమలత పేర్కొంది.