Begin typing your search above and press return to search.
హోదా అంశం మరచిపోయారా పవన్?:సుమన్
By: Tupaki Desk | 28 Oct 2018 10:03 AM GMTగత నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో మొన్నటిదాకా అంటకాగిన...జనసేన అధినేత పవన్ ...మొక్కుబడిగా హోదా గురించి అడపాదడపా ప్రస్తావించారు. ఇక, టీడీపీ సంగతి చెప్పనవరసరం లేదు. హోదా అంటే జైలుకు పంపుతా అని ప్రజలను - ప్రతిపక్షాలను చంద్రబాబు బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. తనకు గుర్తుకు వచ్చినపుడు మాత్రం పవన్...హోదా అంటూ ప్రసంగాలు గుప్పిస్తుంటారు. అయితే, కొంతకాలంగా పవన్ కూడా హోదా అంశాన్ని లేవనెత్తడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ పై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పవన్ మరచిపోయినట్లున్నారని సుమన్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో కరాటే చాంపియన్ షిప్స్ ప్రారంభించిన సందర్భంగా సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కు విపరీతమైన ఫ్యాన్ - యూత్ ఫాలోయింగ్ ఉందని - ఆ ఫాలోయింగ్ ను ప్రత్యేక హోదా కోసం ఉపయోగించుకోవడంలో పవన్ విఫలమయ్యారని సుమన్ వ్యాఖ్యానించారు. మొదట్లో పవన్...హోదా కోసం ఉద్యమం చేశారని ...కానీ, మధ్యలో వదిలేశారని చెప్పారు. మరోసారి హోదా కోసం పవన్ గళమెత్తాలని చెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర హోదా కోసం పవన్ ఆందోళన చేపట్టాలని సుమన్ అన్నారు. ఢిల్లీలో ఆందోళన, నిరసన చేయడం వల్ల మాత్రమే కేంద్రం దిగి వస్తుందని అన్నారు. జనసేన-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని పుకార్లు వస్తోన్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.