Begin typing your search above and press return to search.

సీనియర్ బీజేపీ నేత తప్పుకున్నారా, తప్పించారా!

By:  Tupaki Desk   |   6 April 2019 5:41 AM GMT
సీనియర్ బీజేపీ నేత తప్పుకున్నారా, తప్పించారా!
X
తను ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నియోజకవర్గం నుంచి వరసగా గెలుస్తూ వస్తున్న సుమిత్రా మహాజన్ ఈ సారి తను పోటీలో ఉండటం లేదని ప్రకటన చేశారు. ఈ మేరకు ఆమె స్వయంగా ప్రకటించారు.

అయితే ఆమె ఎన్నికల పోరు నుంచి తప్పుకున్నారా, బీజేపీ అధిష్టానమే తప్పించిందా అనే చర్చ జరుగుతూ ఉంది. సుమిత్రా మహాజన్ ఈ నెలలోనే డెబ్బై ఐదేళ్ల వయసుకు చేరుతున్నారు. ఈ నేఫథ్యంలో బీజేపీ వాళ్లు పెట్టిన నయా రూల్ ప్రకారం ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు లేవని వార్తలు వచ్చాయి.

డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన వారెవరూ ప్రధాన పదవుల్లో ఉండకూడదు అని మోడీ, షాలు తీర్మానం పెట్టారు. పార్టీలో సీనియర్లను అప్రాధాన్యం చేయడానికే వారు ఆ పని చేశారనే అభిప్రాయాలున్నాయి. ఇక ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రకటన చేస్తూ.. ఇండోర్ ఎంపీ అభ్యర్థిని మాత్రం పెండింగ్ లో పెట్టారు. దానిపై సుమిత్ర మహాజన్ ఇది వరకే స్పందించారు.

తను ఎప్పుడూ టికెట్ అడగలేదని, పార్టీనే ఇచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఆమెను తప్పిస్తున్నారని, ఆమె అసహనంతో ఉన్నారనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే చివరకు తను ఎన్నికల బరి నుంచి తప్పుకంటున్నట్టుగా సుమిత్రా మహాజన్ స్వయంగా ప్రకటించారు.

మొత్తానికి డెబ్బై ఐదేళ్ల వయసు నియమం అంటూ.. సీనియర్లను సాగనంపడానికి మోడీ, షాలు అనుసరిస్తున్న వ్యూహం వారికి అనుగుణంగానే పని చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు!