Begin typing your search above and press return to search.
ట్రంప్ మీద కేసు వేసిన మోడల్
By: Tupaki Desk | 18 Jan 2017 9:32 AM GMTఎన్నికలు ముగిశాయి. హాట్ హాట్ ఆరోపణల పర్వం పూర్తి అయిందని అనుకుంటున్నా.. అలాంటిదేమీ లేదన్నట్లుగా ఉంది అమెరికాలో పరిస్థితి. మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రెఢీ అవుతున్న డోనాల్డ్ ట్రంప్ పై తాజాగా రియాల్టీ టెలివిజన్ షో మోడల్ కేసు వేయటం ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పలువురు మహిళలు.. ట్రంప్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
తమను లైంగికంగా వేధింపులకు గురిచేశారని కొందరు.. తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని మరికొందరు ఆరోపించటం తెలిసిందే. అయితే..ఈ ఆరోపణల్ని ట్రంప్ అప్పట్లో కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా రియాల్టీ టెలివిజన్ షో మోడల్ సుమ్మర్ జెర్వస్ న్యూయార్క్ కోర్టులో ఒక కేసు నమోదు చేశారు.
ది అప్రెంటీస్ షోలో తనను అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అసభ్యంగా తాకినట్లుగా సుమ్మర్ జెర్వస్ ఆరోపించారు. ఇలా చేయటం ద్వారా తన మనోభావాల్ని దెబ్బ తీసినట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తనకు సారీ చెబితే చాలని.. తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా చెబితే సరిపోతుందని ఆమె చెబుతున్నారు. తాను దాఖలు చేసిన పిటీషన్ పై ట్రంప్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతంపై ట్రంప్ వర్గంనోరు మెదపటం లేదు. మరోవైపు బాధితురాలిగా చెబుతున్న మోడల్ లాయర్ మాట్లాడుతూ.. తన క్లైంట్ వాదన సత్యశోధన పరీక్షలో నెగ్గినట్లుగా చెబుతూ.. న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/