Begin typing your search above and press return to search.

న్యూయార్క్ సిటీలో ఉమ్మి వేస్తే పిచ్చ లైట్‌!

By:  Tupaki Desk   |   2 March 2016 10:30 PM GMT
న్యూయార్క్ సిటీలో ఉమ్మి వేస్తే పిచ్చ లైట్‌!
X
పెద్ద‌న్న రాజ్యంలో కొన్ని చ‌ట్టాలు చాలా క‌ఠినంగా ఉంటాయి. దారిన పోయే దాన‌య్య పొర‌పాటున రోడ్డు మీద ఉమ్మి వేస్తే చాలు.. పోలీసులు ప‌ట్టుకోవ‌ట‌మే కాదు.. ఏకంగా జైలుకు పంపిస్తారు. అమెరిక‌న్ల‌కు ఇలాంటి రూల్స్ గురించి అవ‌గాహ‌న ఉంటుంది కాబ‌ట్టి ఓకే. కానీ వేరే దేశాల నుంచి వ‌చ్చే వారికి మాత్రం ఇలాంటివి తెలీక తీవ్ర ఇబ్బందుల‌కు గురి కావ‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున జైళ్ల‌కు వెళుతుంటారు కూడా.

ఒక్క ఉమ్మి వేసినందుకు మాత్ర‌మే కాదు.. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మూత్ర విస‌ర్జ‌న చేసినా.. లోక‌ల్ రైళ్ల‌లో ఇద్ద‌రు కూర్చోవాల్సిన సీటులో ఒక్క‌రు కూర్చున్నా.. ప‌బ్లిక్ గా సిగిరెట్ తాగినా.. మందు కొట్టినా జైలే గ‌తి.

ఇంత క‌ఠినంగా ఉండే చ‌ట్టాల మీద అవ‌గాహ‌న లేక నిత్యం చాలామంది జైలుపాలు కావ‌టం జ‌రుగుతుంది. ఈ చ‌ర్య‌ల ప‌ట్ల పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా వాణిజ్య రాజ‌ధానిగా పేరున్న న్యూయార్క్ న‌గ‌రంలో ఇలాంటివి బాగోలేద‌న్న మాట‌పై అక్క‌డి వారు దృష్టి సారించారు. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్లు మార్పు ఉండాల‌న్న ఆలోచ‌న‌తో న్యూయార్క్ ప‌రిపాల‌న విభాగం సరికొత్త నిర్ణ‌యం తీసుకుంది. చిన్న చిన్న నేరాల‌కు పాల్ప‌డే వారికి జైలుశిక్ష లాంటి పెద్ద శిక్ష‌లు అవ‌స‌రం లేద‌ని తేల్చారు.

రోడ్డు మీద ఉమ్మి వేశారా? ప‌బ్లిక్ గా సిగిరెట్ కాల్చారా? మ‌ందు తాగారా? రైల్లో రెండు సీట్ల‌లో ఒక‌రే కూర్చున్నారా? లాంటి చిన్న చిన్న ఇష్యూల మీద దృష్టి సారిస్తున్న పోలీసులు.. పెద్ద పెద్ద నేరాల అదుపుపై దృష్టి సారించ‌టం లేద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఉన్న‌తాధికారులు.. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న క‌ఠిన చ‌ట్టాల్ని కాస్తంత స‌ర‌ళం చేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో.. చిన్న చిన్న‌నేరాల‌కు అరెస్ట్ అంత పెద్ద శిక్ష‌లు అవ‌స‌రం లేద‌ని తేల్చారు. న్యూయార్క్ వాసుల‌కు ఇది కాస్త రిలీఫ్ క‌లిగించే అంశమ‌నే చెప్పాలి.