Begin typing your search above and press return to search.

ఏపీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గురించి చెప్పిన బాబు!

By:  Tupaki Desk   |   29 Jan 2018 4:50 AM GMT
ఏపీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గురించి చెప్పిన బాబు!
X
కొన్ని సంద‌ర్భాల్లో లోతుగా ఆలోచిస్తార‌న్న‌ట్లు మాట్లాడే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అప్ప‌టిక‌ప్పుడు అనిపించింది చెప్పేసే తీరు ఆయ‌న‌లో క‌నిపిస్తుంటుంది. ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ విష‌యంలో బాబు మాట‌లు వింటే ఇదే భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ స్యూరుడేన‌ని చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

తూర్పు తీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉద‌యిస్తున్నందున స‌న్ రైజ్ స్టేట్ గా నినాద‌మిచ్చిన‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. సూర్య‌భ‌గ‌వానుడ్ని త‌మ తాజా బ్రాండ్ అంబాసిడ‌ర్‌ ను చేసేశారు. అన్ని మ‌తాల్లోనూ సూర్యుడికి ప్రాధాన్య‌త ఉంద‌న్న బాబు.. ఇక‌పై ప్ర‌తి ఏటా రాష్ట్ర వేడుక‌గా నిర్వ‌హిస్తామ‌న్నారు.

ప్ర‌కృతిని ఆరాధిస్తామంటూ జ‌ల‌హార‌తి.. సూర్యారాధ‌న‌.. అమ్మ‌కు వంద‌నం పేరుతో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. అర‌బ్ దేశాల్లో సూర్యుడ్ని ష‌మ్స్ పేరుతో ఆరాధిస్తార‌ని..క్రైస్తువులు సైతం సూర్యుడికి ప్రాధాన్య‌త ఇస్తార‌న్నారు. నిత్య చైత‌న్య‌మూర్తి అయిన సూర్యుడ్ని ఆరాధిస్తే నిత్య ప్రేర‌ణ పొందొచ్చ‌ని.. సూర్యుడు జ‌స్టిస్ చ‌క్ర‌వ‌ర్తి లాంటి వాడ‌న్నారు. త‌ర త‌మ భేదం లేకుండా సూర్యుడు వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పారు.

సూర్యారాధ‌న ఏ మతానికి చెందిన‌ది కాద‌ని.. కొంద‌రు అపోహ‌లు సృష్టిస్తున్న‌ట్లు చెప్పిన చంద్ర‌బాబు.. సౌర‌శ‌క్తితో రాష్ట్రంలో ఐదు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. బాబు మాట‌ల‌న్నీ భేషుగ్గా ఉన్నాయి. కానీ.. సూర్యుడు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని చెబుతున్న ఆయ‌న‌.. కొంత‌కాలంగా ఏపీకి త‌మ అధినేత చంద్ర‌బాబే బ్రాండ్ అంబాసిడ‌ర్ అని.. ఆయ‌న ఉండ‌గా వేరెవ‌రో బ్రాండ్ అంబాసిడ‌ర్లు ఉండాల్సిన అవ‌స‌రం లేదంటూ తెలుగు త‌మ్ముళ్లు చెప్పిన మాట ముచ్చ‌ట ఏంటి? ప‌్ర‌కృతి మీద మ‌మ‌కారం ఉన్న‌ట్లుగా గొప్ప‌లు చెబుతున్న చంద్ర‌బాబు.. ఏపీలో ప‌చ్చ‌ద‌నం అంత‌కంత‌కూ త‌గ్గిపోవ‌ట‌మే కాదు.. జాతీయ స్థాయిలో ప‌చ్చ‌ద‌నం క‌నుమ‌రుగు అవుతున్న ప్రాంతాల్లో ఏపీ అగ్ర‌భాగాన ఉన్న విష‌యం మీద ఏం చేస్తున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబితే బాగుంటుంది. అదేమీ లేకుండా స‌మ‌యానికి త‌గ్గ‌ట్లు ఏదో ఒక‌టి చెప్పేసే ధోర‌ణిని బాబు త‌గ్గించుకుంటే మంచిద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.