Begin typing your search above and press return to search.
సన్ టీవీ షేర్లు ఢమాల్..
By: Tupaki Desk | 19 May 2016 9:17 AM GMTఈసారి డీఎంకేదే అధికారం అంటూ జాతీయ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఊదరగొట్టేయడంతో గత కొన్ని రోజుల నుంచి డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబానికి చెందిన సన్ టీవీ షేర్లు ఒక్కసారి ఊపందుకున్నాయి. వాటి ప్రైస్ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఐతే గురువారం ఎన్నికల ఫలితాల సరళి చూశాక ఒక్కసారి సన్ టీవీ షేర్లు దబేల్ మని కింద పడ్డాయి.
తమిళనాడులో జయలలిత పార్టీ అన్నాడీఎంకే విజయం దాదాపు ఖాయం కావడంతో గురువారం ట్రేడింగ్ లో సన్ టీవీ షేర్లు 12 శాతానికి పైగా పతనమయ్యాయి. ఒకే రోజు 12 శాతం పడిపోవడమంటే చిన్న విషయం కాదు. మధ్యాహ్నానికి సన్ టీవీ షేర్ 52 రూపాయల దాకా నష్టపోయి 374 రూపాయలకు చేరుకోవడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మి భారీగా సన్ టీవీ షేర్లు కొన్న మదుపుదారులు దారుణంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉదయం ఎన్నికల ఫలితాల సరళి తెలియగానే మదుపరులు ఒక్కసారిగా సన్ టీవీ షేర్లను అమ్మేయడం మొదలుపెట్టారు. దీంతో షేర్ ప్రైస్ రయ్యిన కింద పడింది. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్రను తిరగరాస్తూ జయలలిత రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో డీఎంకే పార్టీకి మున్ముందు చుక్కలు కనిపించడం ఖాయం. గత ఐదేళ్లలో చాలా దెబ్బ తిన్న సన్ నెట్ వర్క్ కు భవిష్యత్తులో మనుగడే ప్రశ్నార్థకమవుతుందని కూడా అంటున్నారు. కాబట్టి మున్ముందు సన్ టీవీ షేర్ ప్రైస్ మరింత తగ్గడం ఖాయం.