Begin typing your search above and press return to search.
శశి థరూర్ కు చెమటలు పట్టిస్తున్న సునంద
By: Tupaki Desk | 23 Jan 2016 5:21 AM GMTకేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ కు ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఉపశమనం దొరికినట్లే దొరికి మళ్లీ బిగుసుకుంటోంది. ఆమె మృతికి విష ప్రయోగం కారణం కాదని గతంలో నివేదికలు రావడంతో ఊపిరిపీల్చుకున్న ఆయన తాజాగా విష ప్రయోగమే కారణమని మళ్లీ నివేదికలు రావడంతో ఆందోళన చెందుతున్నారట. ఇది తిరిగితిరిగి తన మెడకు ఎప్పుడైనా చుట్టుకునే ప్రమాదముందని ఆయన భయపడుతున్నట్లు సమాచారం.
సునంద పుష్కర్ విషప్రయోగం వల్లనే మరణించినట్లు ఎయిమ్స్ మెడికల్ బోర్డు అభిప్రాయపడింది. ఆమె అంతరావయవ నమూనాల పరీక్ష అనంతరం ఎఫ్ బీఐ నివేదికను బోర్డు పరిశీలించి, అధ్యయన సారాంశాన్ని ఢిల్లీ పోలీసులకు అందజేసింది. ఆల్ప్రజొలామ్ మాత్రల ఖాళీ స్ర్టిప్ తోపాటు కాలేయం - మూత్రపిండాల అర్ధభాగాలు - ప్లీహం - రక్తనమూనా - మూత్రంతో తడిసిన దుస్తుల పరీక్షనుబట్టి ఆ ఔషధాన్ని అధిక మోతాదులో తీసుకోవడమే మరణ కారణం కావచ్చునని ఎఫ్ బీఐ పేర్కొంది. దాంతో ఏకీభవిస్తున్నప్పటికీ శరీరంపై సిరంజి గుచ్చిన గుర్తును బట్టి విషపూరిత ఇంజెక్షన్ కూడా కారణమై ఉండొచ్చుని భావిస్తున్నామని ఎయిమ్స్ నివేదిక ఇచ్చింది. అలాగే శరీరంపై గాయాలనుబట్టి మరణానికి ముందు తీవ్రపెనుగులాట చోటుచేసుకున్నట్లు తెలుస్తోందని ఎయిమ్స్ నివేదిక ఇచ్చింది. దీంతో సునంద కేసు మరోసారి శశి థరూర్ కు చెమటలు పట్టిస్తోంది.