Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్;ఈ 360డిగ్రీ సెల్ఫీ ఏమిటి బాసూ..?

By:  Tupaki Desk   |   18 Dec 2015 5:13 AM GMT
హాట్ టాపిక్;ఈ 360డిగ్రీ సెల్ఫీ ఏమిటి బాసూ..?
X
గురువారం మధ్యాహ్నం వరకూ పెద్దగా పరిచయం లేని ఒక పదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో ప్రఖ్యాత క్రికిట్ క్రీడా వ్యాఖ్యాత.. హైదరాబాదీ హర్షా బోగ్లే చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ గా మారింది. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలో సుందర్ పిచాయ్ తో విద్యార్థులు జరిపిన ఇష్టాగోష్ఠి కార్యాక్రమానికి హర్షా బోగ్లే యాంకరింగ్ చేశారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యే సమయంలో హర్షాబోగ్లే ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాను ఇప్పుడు భారత యువత చేసే ఒక పనిని తాను చేస్తున్నట్లు చెప్పిన హర్షా.. తాను ఈ పని చేసిన తర్వాత.. అందరూ ఈ విషయం గురించి గూగుల్ చేయటం ఖాయమని వ్యాఖ్యానించారు.

ఇంతకూ ఆయనేం చేస్తారంటూ సుందర్ పిచాయ్ కాస్తంత ఆసక్తిగా చూశారు. ఇంతలో తన చేతిలోకి చిన్నపాటి సెల్ ఫోన్ తీసుకొని.. తానిప్పుడు సుంరద్ పిచాయ్ తో 360డిగ్రీల సెల్ఫీ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ సెల్ఫీ అంటే తెలియటమే కాదు.. విస్తృతంగా వినియోగించే యువతకు ఉన్నట్లుండి.. ‘‘360 డిగ్రీ’’ సెల్ఫీ అన్న మాట వినిపించటంతో ఇదేంటి కొత్తగా అన్న సందేహం వ్యక్తమైంది. వెంటనే గూగుల్ ను సెర్చ్ చేయటం మెదలెట్టారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో 360 డిగ్రీ సెల్ఫీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింద. ఇంతకీ ఈ 360 డిగ్రీ సెల్ఫీ అంటే ఏమిటి?దాని కతేంటి..?

సెల్ఫీలో మనం.. మనతో ఉండే వ్యక్తులు మాత్రమే పడతారు. కానీ.. ఈ 360 డిగ్రీల సెల్ఫీలో చుట్టు పక్కల ఉన్నవాళ్లంతా ఒక్కక్లిక్ లో ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు. సెల్ఫీలకు కాస్తంత భిన్నంగా 360 డిగ్రీ సెల్ఫీ తీసుకునే వారు.. చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని కవర్ చేసే వీలు కలుగుతుంది. ఇలాంటి డివైజ్ లు మార్కెట్లో భారీగానే లభిస్తున్నాయి. ఇలాంటి ఫీచర్లు ఉన్న కెమేరాలు.. ఫోన్ల విషయానికి వస్తే.. రికోహ్ తెటా కెమేరా.. జిరాఫ్టిక్ 360 క్యామ్.. రోల్లీ ఈపనో సెల్ఫీ.. సైక్లోరామిక్ సెల్ఫీ 360 యాప్ లతో పాటు.. మరిన్ని ఫోన్లకు.. కెమేరాలకు ఈ తరహా ఫీచర్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సోషల్ మీడియాలో పలువురు.. హర్షాబోగ్లే వినియోగించిన డివైజ్ ఏమిటో అర్థం కాక.. దాని వివరాలు చెప్పాలంటూ పలువురు పోస్ట్ చేయటం కనిపించింది. మరి.. ఆ విషయం ఏదో హర్షా బోగ్లే చెప్పేస్తే బాగుంటుంది.