Begin typing your search above and press return to search.
జగన్ మాట్లాడారనే బాబు హోదా బాట!
By: Tupaki Desk | 11 Aug 2018 5:02 AM GMTమిత్రత్వం పోయి.. శత్రువులుగా మారిన వేళ.. టీడీపీ.. బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో సాగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేలేదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో బాబు సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. తాజాగా నరసరావుపేటలో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి.. రాష్ట్ర సహాయ ఇన్ ఛార్జి సునీల్ దేవధర చేసిన వ్యాఖ్యలు ఘాటుగా ఉండటమే కాదు.. బాబు సర్కారుపై ఏ రీతిలో ఎదురుదాడి చేయాలన్న విషయంపై మరింత క్లారిటీ తెచ్చారని చెప్పాలి.
ప్రత్యేక హోదా గురించి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు స్పందిస్తున్నారని చంద్రబాబు భావించారని.. తాను ఎక్కడ వెనుకబడి పోతానన్న భయంతోనే సానుభూతి కోసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నట్లుగా దేవధర్ మండిపడ్డారు.
బాబు తీరు చూస్తే.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు ఉందని తెలంగాణలో బాగా ప్రసిద్ధి చెందిన సామెతను గుంటూరు జిల్లా నరసరావు పేటలో వాడారు. కానీ.. ఏపీ ప్రజలకు ఇలాంటి మాటలు అర్థం కావన్న విషయాన్ని ఆయన తెలీనట్లుంది. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తుంటే వాటిని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలోనే అతి పెద్ద అవినీతిపరుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు అని.. నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్నారు. సొంత బలంతో ఎప్పుడూ అధికారంలోకి రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలను.. కాంట్రాక్టర్లను.. కుటుంబ సభ్యులను అభివృద్ధి చేస్తున్నారని.. ఆయన హయాంలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు.
చంద్రబాబుకు అవినీతి డబ్బు.. మీడియా మద్దతు ఉంటే.. బీజేపీ వైపు ప్రధాని మోడీ.. ధర్మం.. నీతి.. నిజాయితీ ఉందన్నారు. అమరావతిలోనూ గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేయటం గమనార్హం. హోదా మీద ఏపీకి హ్యాండ్ ఇచ్చిన బీజేపీ నేత.. వచ్చే ఎన్నికల్లో అమరావతిలోనూ విజయం ఖాయమన్న మాట వింటే.. కమలనాథుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ మరింత ఎక్కువైనట్లుగా కనిపించక మానదు. ఇంతకాలం బాబు వెన్నుపోటు మాట కమలనాథుల నోట రాలేదు. ఆ కొరత తాజా విమర్శతో తీరిందని చెప్పాలి.