Begin typing your search above and press return to search.
కోహ్లీ ఓపెనర్ గా ఉండాలి.. మరో ఆలోచన వద్దు..!
By: Tupaki Desk | 22 March 2021 4:30 PM GMTమాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. టీ20లో టీమిండియా కెప్టెన్ కోహ్లిని ఓపెనర్ గా కొనసాగించాల్సేందనని స్పష్టం చేశారు. ఈ ప్లేస్‌కు కోహ్లీ అయితేనే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సీరిస్ ను గెలుచుకున్నది. ఈ మ్యాచ్‌లో విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లీ 52 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లలతో చెలరేగాడు.
సూర్యకుమార్, రోహిత్ శర్మ, పాండ్యా కూడా పరుగుల వర్షం కురిపించడంతో టీమిండియా భారీ స్కోర్ ను సాధించిది.ఈ మ్యాచ్ అనంతరం కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘విరాట్-రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీని ఇలాగే కొనసాగించాలి. సచిన్ కూడా తన కెరీర్ స్టార్టింగ్‌లో మిడిల్ ఆర్డర్లో ఆడేవాడు. కానీ ఓపెనింగ్ కు వచ్చాక రికార్డులు బద్దలు కొట్టాడు. అలాగే విరాట్ కూడా ఓపెనర్‌గా రావడమే కొనసాగించడమే బెటర్ అని పేర్కొన్నారు.
‘రాహుల్ ఫామ్ కోల్పోవడం కలిసొచ్చింది. ఎందుకంటే ఈ కొత్త జోడీ(రోహిత్-కోహ్లీ) భవిష్యత్‌పై ఆశలు పెట్టుకునేలా చేసింది. అతడిని ఓపెనింగ్‌లో పంపించగానే టీమ్‌ఇండియా రూపురేఖలే మారిపోయాయి. అది అతడి వ్యక్తిగత ప్రదర్శన మీదే కాకుండా జట్టు మొత్తంపైనే ప్రభావం చూపింది. కాబట్టి, బాగా ఆడేవారిని ముందుగా బ్యాటింగ్‌కు పంపాలి. రోహిత్, కోహ్లీ జోడీని ఇలాగే కొనసాగించాలి' అని గవాస్కర్ పేర్కొన్నాడు.టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన తర్వాత కోహ్లికి ప్రశంసల జల్లు కురుస్తున్నది.
ఈ సీరిస్‌లో రాహుల్ విఫలమయ్యాడు. తొలి టీ20లో ఒక్క పరుగు చేసిన అతను తర్వాత 0, 0, 14 పరుగులు చేశాడు. దీంతో ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న అతన్ని టీమిండియా చివరి మ్యాచ్‌లో పక్కకు పెట్టింది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. తొలిమ్యాచ్‌లోనే సక్సెస్ కావడంతో టీ20లో ఈ ఇద్దరిని దించాలన్న వాదన తెరమీదకు వచ్చింది. సోషల్‌మీడియాలోనూ కోహ్లిని ఓపెనర్ గా తీసుకు రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గవాస్కర్ కూడా అదే రకమైన వాదనను తెర మీదకు తీసుకు రావడం గమనార్హం.