Begin typing your search above and press return to search.
డబ్ల్యూటీసీ ఫైనల్ , ఇంగ్లాండ్ ను కోహ్లీసేన క్లీన్‌స్వీప్ చేస్తుంది : సునీల్ గవాస్కర్
By: Tupaki Desk | 18 Jun 2021 8:30 AM GMTటెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ చివరి అంకం ప్రారంభమైంది. గత రెండేళ్లుగా సుదీర్ఘంగా సాగిన ఈ మెగా టోర్నీ టైటిల్ పోరు ప్రారంభమైంది. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో రెండు టీమ్స్ కూడా ఇంగ్లాండ్ గడ్డపై ప్రపంచ మేటి జట్టుగా నిలబడటానికి సిద్దమైయ్యాయి. ఈ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పై ఇప్పటికే పలువురు లెజెండ్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కొందరు ఇండియా కచ్చితంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలుస్తుంది అని చెప్తుండగా , మరికొందరు న్యూజిలాండ్ కప్ ఎగురేసుకుపోతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే .. తాజాగా ఇండియా లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ , అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి తాజాగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఖచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే , న్యూజిలాండ్ ను కూడా అంత తక్కువ అంచనా వేయడానికి ఆస్కారమేమి లేదు అని , ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా కామ్ గా న్యూజిలాండ్ తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అయితే , ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీం ను కొట్టి కప్ ఎగురేసుకుపోవాలంటే అంత సులభం కాదు అని అన్నారు. ఖచ్చితంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఇండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మాట్లాడుతూ .. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఒక్కటే కాదు , ఆ తర్వాత ఆతిథ్యం ఇస్తున్న ఇంగ్లాండ్ ను కూడా టెస్టుల్లో 4-0 తో మట్టి కరిపిస్తుందని , సాధారణంగా విదేశాల్లో ఇండియా కి అంతగా రికార్డ్స్ లేకపోయినప్పటికీ , ఈ మధ్య ఇండియా ఆట తీరు , విదేశాల్లో మెరుగైన ప్రదర్శన ను బట్టి చూస్తే కోహ్లీ సేన ఖచ్చితంగా టెస్ట్ సిరీస్‌ను 4-0 తేడాతో కోహ్లీ సేన క్లీన్‌స్వీప్ చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరగనుంది.
ఇకపోతే , జెంటిల్మన్ గేమ్‌లో అతిపెద్ద అడుగు ముందుకు పడబోతున్నది. ఉత్కంఠ రేపే సిరీస్‌లున్నా, నరాలు బిగపట్టి చూసిన మ్యాచ్‌లకు కొదవలేకున్నా, ఒకే ఒక్క మ్యాచ్ మాత్రం ఇప్పుడు క్రికెట్ ప్రపంచం తనవైపు తిప్పుకుంది. అదే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్. లిమిటెడ్ ఓవర్లలో ఫార్మాట్ కో వరల్డ్ కప్ ఉన్నా.. ట్రెడిషనల్ గేమ్ కు మాత్రం ఇప్పటి వరకు ప్రపంచ స్థాయి ట్రోఫీ మాత్రం లేదు. ఇప్పుడు ఆట్రోఫీ ని అందుకునేందుకు భారత్, న్యూజిలాండ్ సిద్దమయ్యాయి. ఒకరిదేమో దూకుడు, మరొకరిదేమో నిలకడ ఈ రెండింటి మధ్య అగ్గి పుట్టించే అసలు సిసలైన పోరాటం కోసం అటు విరాట్ కోహ్లీ, ఇటు కేన్ విలియమ్సన్ రెడీ అయ్యారు. మరికొద్ది గంటల్లోనే ఈ మెగా పోరు షురూ కానుంది. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత ప్రభావిత బ్యాట్స్ మెన్. మైదానంలోకి దిగాడంటే ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా.. పరుగులు చేయడం మాత్రమే అతడికి తెలుసు. దీంతో ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరుపై లికించుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు, 22 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ఒకవైపు పరుగులు, మరోవైపు కెప్టెన్‌గా విజయాలు సాధిస్తూ దుమ్మురేపాడు. ఈ క్రమంలో భారత అత్యుత్తమ టెస్టు కెప్టెన్ గా ఎదిగాడు. అయితే ఓ లోటు మాత్రం కోహ్లీకి ఇప్పటికీ వెంటాడుతోంది. అదే ఐసీసీ ట్రోఫీ. ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా ధోనీ నిలిచాడు. ధోనీని గురువుగా భావించే విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. కోహ్లీ సారథ్యంలో భారత్ ఈ ఐదేళ్ల కాలంలో ఓసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుని ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ నుంచి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ టెస్టు చాంపియ న్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రూపంలో ఐసీసీ ట్రోఫీ అందుకునే సువర్ణావకాశం కోహ్లీ ముందుంది. ఇన్నాళ్ల తన కలను నెరవేర్చుకునేందుకు ఇదే మంచి అవకాశమని అందరూ అంటున్నారు.