Begin typing your search above and press return to search.
సన్నీకి నోటి దురుసు ఎక్కువే.. నాడు గంగూలీపైనా ఇంతే..
By: Tupaki Desk | 21 May 2022 10:30 AM GMTసునీల్ గావస్కర్.. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మన్ లలో ఒకరు. 1970ల్లో భీకర వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ ను తలుచుకుంటేనే క్రీజులో కాళ్లు వణికేవి. వారిని తట్టుకుని నిలవడమంటే ఇక మాటలు కాదు. అలాంటిది కనీసం హెల్మెట్ కూడా లేకుండా వారిని దీటుగా ఎదుర్కొనడ్డాడు సన్నీ. టెక్నికల్ గా ఎంతో సౌండ్ అయినప్పటికీ.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు. అందుకే అతడిని అందరూ ఆ రోజుల్లో ఆరాధించేవారు. రిటైరయినాక సన్నీ కామెంట్రీని ఎంచుకున్నారు. కొన్నాళ్లు పత్రికలకు వ్యాసాలూ రాశారు.
నాడు కలం జారాడు.. నేడు మాట తూలాడు..
అయితే సునీల్ గావస్కర్ బ్యాట్స్ మన్ గా ఎంత ప్రతిభావంతుడో అప్పుడప్పుడు తన స్థాయిని అంతే తక్కువ చేసుకుంటూ ఉంటాడు. చాన్నాళ్ల కిందట.. సరిగ్గా చెప్పాలంటే 26 ఏళ్ల కిందట.. 1996 ఇంగ్లండ్ టూర్ కు టీమిండియాను ఎంపిక చేశారు. అప్పటికే కపిల్ దేవ్, వెంగ్ సర్కార్ తదితర మేటి ఆటగాళ్లు రిటైరైన నేపథ్యంలో కొత్త తరం అవసరమైంది. అలాంటప్పడు కోల్ కతా ప్రిన్స్ గా పేరొందిన సౌరభ్ గంగూలీని టెస్టు జట్టులోకి తీసుకున్నారు. వాస్తవానికి గంగూలీ 1991 వెస్టిండీస్ టూర్ లోనే జట్టులోకి వచ్చినా.. ప్రదర్శన, ప్రవర్తన కారణంగా పక్కనపెట్టారు.
అయితే, దేశవాళీల్లో మెరుగున ఆటతో అతడు మళ్లీ తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో కొత్త తరాన్ని స్వాగతించాల్సిన సన్నీ.. గంగూలీ ఎంపికను తీవ్రంగా తప్పుబట్టాడు. సౌరభ్ కు ఫీల్డింగ్ రాదని.. బ్యాట్స్ మన్ గానూ గొప్ప ఏమీ కాదంటూ ఓ తెలుగు ప్రధాన ప్రతికలో వ్యాసం రాశాడు. కానీ, అదే టూర్ లో గంగూలీ అదరగొట్టాడు. వరుసగా రెండు సెంచరీలు బాది జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా చరిత్ర గర్వించదగ్గ కెప్టెన్ అయ్యాడు. దాదాపు 13 ఏళ్లు కొనసాగాడు. మధ్యమధ్యలో సన్నీ.. పాశ్చాత్య మీడియాపై విరుచుకుపడుతుండేవాడు. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేకున్నా.. తాజాగా ఐపీఎల్ కామెంట్రీ లో నోరు జారి నెటిజన్లకు చిక్కాడు.
ఏమన్నాడు.. గావస్కర్..
శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో సన్నీ.. రాజస్థాన్ బ్యాట్స్ మన్ హెట్ మెయర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 15 ఓవర్లకు 104/4తో ఉంది. రవిచంద్రన్ అశ్విన్ (13), షిమ్రన్ హెట్‌మెయర్ (0) క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమయ్యాయి.
ఆ సమయంలోనే ప్రత్యక్ష ప్రసారంలో కామెంట్రీ చేస్తున్న గావస్కర్ హెట్‌మెయర్‌ను ఉద్దేశించి "Hetmyer's wife delivered, will Hetmyer deliver for the Royals now?" అని అన్నాడు. విదేశీ ఆటగాడి వ్యవక్తిగత జీవితంలో జరిగిన సంతోష సందర్భాన్ని ఉటంకిస్తూ 'డెలివర్' అనడం సన్నీ స్థాయికి సరితూగదు. ఇది చివరకు నెటిజన్లకు కోపం తెప్పించింది. అతడి వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయంటూ, అవి అభ్యంతరకరం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. హెట్‌మెయర్ భార్య ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. అతడు స్వదేశానికి వెళ్లి తిరిగొచ్చాడు. జట్టు గెలిచే కీలక దశలో 6 పరుగులకే ఔటయ్యాడు.
నీకిది తగునా? బ్యాటింగ్ గ్రేట్?
బ్యాటింగ్ లో సాక్షాత్తు సచిన్ టెండూల్కర్ కే ఆదర్శప్రాయిడైన గావస్కర్ .. అనుచిత వ్యాఖ్యలతో పరువు పోగొట్టుకోవడం తగినపనేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదివరకంటే ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. కానీ, ఇది సోషల్ మీడియా కాలం. కన్ను ఆర్పినా పసిగట్టే కాలం. అలాంటప్పడు ట్రోలింగ్ కు చిక్కకుండా ఉండాలి. కానీ.. గావస్కర్ నోటిని అదుపు చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.
ముంబైకర్లను వెనకేసుకొస్తాడన్న అపవాదు..
గావస్కర్.. ముంబైకి చెందినవాడు. కానీ, భారత బ్యాటింగ్ ఐకాన్. అయితే, ఆటగాళ్ల విషయంలో ముంబై వారిని గట్టిగా వెనకేసుకొస్తాడనే అపవాదు ఉంది. దేశానికి తన సేవలను చూసి ఎవరూ దీనిని ప్రశ్నించరు. అయితే, దేశం గర్వించదగ్గ ఆటగాడికి ఇది సరైన పద్ధతి కాదు.