Begin typing your search above and press return to search.
దేశంలో వ్యభిచార గృహాల్లో మనమ్మాయిలేనంట
By: Tupaki Desk | 2 Aug 2015 10:58 AM GMTఒళ్లు జలదరించే వాస్తవం ఒకటి బయటకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగమ్మాయికి ఎంత ఆపద పొంచి ఉందో తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుంది. సామాజిక కార్యకర్త.. హ్యుమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సునీతా కృష్ణన్ ఒక పచ్చి నిజాన్ని బయటపెట్టారు.
దేశ వ్యాప్తంగా వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న వ్యభిచారుణుల్లో 95 శాతం మంది తెలుగు అమ్మాయిలేనని చెప్పారు. హ్యుమన్ ట్రాఫికింగ్ లో భాగంగా పేద.. అమాయక మహిళల్ని లక్ష్యంగా చేసుకొని అక్రమంగా తరలిస్తున్నారని.. వీరంతా పెద్ద ఎత్తున వ్యభిచార కూపంలో మగ్గిపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
సునీతా కృష్ణన్ చెప్పిన మాటల్ని చూస్తున్నప్పుడు.. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏ మాత్రం క్షేమకరం కావన్న భావన కలగటం ఖాయం. మరి.. ఈ గణాంకం ఎంతవరకు నిజమన్న విషయంపై పోలీసు అధికారులు వివరణ ఇస్తే బాగుంటుంది. ఇంత భారీ ఎత్తున తెలుగు అమ్మాయిల్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా ఎవరు? దాని వెనుక ఎవరున్నారన్న విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుండు.