Begin typing your search above and press return to search.
వివేకా కూతురుకు ప్రాణహానా ?
By: Tupaki Desk | 13 Aug 2021 1:01 PM GMTవైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కుటుంబానికి ప్రాణహాని ఉన్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఎవరో చేయటం కాదు స్వయంగా సునీతారెడ్డే చేయటం సంచలనంగా మారింది. తన తండ్రి హత్య వెనుక ఉన్న అసలు వ్యక్తులను బయటపెట్టాలని సునీత కొద్దిరోజులుగా సీబీఐపై ఒత్తిడి పెడుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఆమె కోర్టులో కేసు కూడా వేశారు. కారణం ఏదైనా కానీ సీబీఐ విచారణకు న్యాయస్ధానం ఆదేశించింది.
కరోనా వైరస్ తదితర కారణాల వల్ల ఇంతకాలం స్తబ్దుగా ఉన్న విచారణ ఇప్పుడిప్పుడే స్పీడందుకుంటోంది. అనుమానితులందరినీ పట్టుకుని విచారణ జరుపుతోంది. సునీత ఎవరిమీదైతే తనకు అనుమానం ఉందని పిర్యాదులో చెప్పారో వారిలో ఇప్పటికే చాలామందిని సీబీఐ విచారించటమో లేదా అదుపులోకి తీసుకోవటమో చేసింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను వెతికేపనిలో చాలా సీరియస్ గా ఉన్నారు అధికారులు. ఇలాంటి దశలోనే సునీత విషయంలో కీలకమైన పరిణామం చోటుచేసుకున్నది.
అదేమిటంటే కేసును ఇంతటి వదిలేయాలని సునీతకు గుర్తు తెలీని వ్యక్తుల నుండి ఫోన్లు వస్తున్నాయట. ఇదే విషయాన్ని ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదులో చెప్పారు. అలాగే ఈనెల 10వ తేదీన ఓ అనుమానిత వ్యక్తి సాయంత్రం తన ఇంటిముందు కనబడినట్లు కూడా చెప్పారు. ఆనవాళ్ళ ప్రకారం సదరు వ్యక్తి మణికంఠారెడ్డి అయ్యుండచ్చని ఆమె చెప్పారు. అనుమానితుడు ఎవరంటే హత్యకేసులో ఆరోపణలను ఎదుర్కొని ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరైన శివశంకర్ రెడ్డికి సన్నిహితుడని తేలింది.
ఇదే విషయమై అన్బురాజ్ మాట్లాడుతు సునీత తనకు ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. ఆమె కోరినట్లుగానే ఆమె ఇంటి దగ్గర భద్రతను ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. ఫిర్యాదులోని అన్నీ అంశాలపైనా దర్యాప్తు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. మొత్తానికి తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని సునీతారెడ్డి చెప్పటం సంచలనంగా మారింది. అసలు హంతకులను పట్టుకునేంత లోపు ఇంకేమి జరుగుతుందో అనే టెన్షన్ మొదలైపోయింది.