Begin typing your search above and press return to search.
అసంతృప్తి తో సుప్రీం తీర్పుని స్వాగతించిన సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్..
By: Tupaki Desk | 9 Nov 2019 6:59 AM GMTగత కొన్నేళ్లుగా సాగుతున్న అయోధ్య వివాదాస్సద స్థలంపై సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తన తుది తీర్పును వెల్లడించింది. అయోధ్య వివాదాస్పద స్థలం రామజన్మభూమి న్యాస్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముస్లీంలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించింది. హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటు చేసి, ఆలయ ట్రస్ట్ కు అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారం మొత్తం మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది.
అయితే సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్ జాఫర్‌యాబ్ జిలాని. కానీ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు. సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదన్నారు. తీర్పులో అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొనాలని అంతా కోరుకుంటున్నామన్నారు. తీర్పులో ప్రతీ అంశాన్ని వ్యతిరేకించడం లేదు కానీ.. కొన్ని అంశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే అంశాన్ని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు.