Begin typing your search above and press return to search.

సంచలనం: అయోధ్యపై ముస్లింల రాజీ!?

By:  Tupaki Desk   |   17 Oct 2019 4:55 AM GMT
సంచలనం: అయోధ్యపై ముస్లింల రాజీ!?
X
1992లో బాబ్రీ మసీదు కూల్చాక చెలరేగిన హిందూ-ముస్లిం గొడవల్లో 2వేల మందికి పైగా మరణించారు. నాటి నుంచి నేటి వరకు బాబ్రీ మసీదు-శ్రీరామ జన్మభూమి స్థల వివాదం సుప్రీం కోర్టులో నలుగుతూనే ఉంది. ఇన్నేళ్లుగా ఎంతో మంది సుప్రీం జడ్జీలు మారినా దేశంలో మతకల్లోలాలు చెలరేగే ఈ కేసు తీర్పు మాత్రం వెలువరించడానికి ఏ జడ్జి సాహసించకపోవడం గమనార్హం. తెగని పీటముడిగా మారిపోయిన ఈ కేసులో తాజాగా భారీ ట్విస్ట్ నెలకొంది.

అయోధ్య కేసులో ముస్లింలు వెనక్కి తగ్గారు. ఇదో అనూహ్యమైన సంచలన మలుపు. ఎప్పుడూ పట్టుబట్టి సాధించేవారు వెనక్కి తగ్గడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు సీబీఐని ప్రయోగించిందన్న గుసగుసలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఈ వివాదానికి ఓ పరిష్కారం లభించింది.

ఈ బాబ్రీ మసీదు-శ్రీరామ జన్మభూమి స్థలంపై తమకు గల హక్కును వదులుకోవడానికి ప్రధాన కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు సంసిద్ధత వ్యక్తం చేయడం ఈ కేసులోనే గొప్ప మలుపుగా చెప్పవచ్చు. కానీ ఇందుకు కొన్ని షరతులు విధించింది. ఈ మేరకు చివరిరోజు ఈ కేసులో వాదనలు ముగిసి తీర్పు వెలువరిస్తుండగా ముస్లిం బోర్డు తన ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందు ఉంచింది. దీంతో దశాబ్ధాలుగా సాగుతున్న రామజన్మభూమి వివాదం సామరస్యంగా పూర్వకంగా కోర్టు వెలుపల పరిష్కారం కావచ్చని ఆశలు చిగురించాయి. హిందూ ముస్లింల మధ్య కొట్లాటకు కారణమైన ఈ స్థల వివాదంలో ముస్లింలే వెనక్కి తగ్గడం తాజాగా దేశంలోని అన్ని వర్గాలకు ఊరటనిచ్చే అంశం.

* సున్నీ బోర్డు బాబ్రీ మసీదు స్థలాన్ని వదులుకునేందుకు పెట్టిన షరుతులు ఇవే..

1 )బాబ్రీ మసీదు స్థలాన్ని నేలమట్టం చేసిన తర్వాత ప్రతిగా ఓ పెద్ద మసీదును అయోధ్యలోనే వేరే చోట నిర్మించాలి.

2) అయోధ్యలో శిథిలమైన 22 మసీదుల మరమ్మతులు యూపీ సర్కారు చేపట్టాలి

3) దేశంలోని ప్రఖ్యాత మసీదులన్నింటిల్లో ప్రార్థనలకు అనుమతులు ఇవ్వాలి

ఇక ఈ మూడింటితోపాటు దేశంలోని మసీదులకు రక్షణ - కబ్జాలు - ఆక్రమణలు - విధ్వంసాలు జరగకుండా చూడాలని బోర్డు కోరింది. 1991 నాటి ప్రార్థనా స్థల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించింది.