Begin typing your search above and press return to search.
సవతి తల్లి - కొడుకు.. బీజేపీ అభ్యర్థులుగా..!
By: Tupaki Desk | 21 April 2019 9:05 AM GMTఇప్పటికే మధురలో పోలింగ్ పూర్తి అయ్యింది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా హేమమాలిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన హేమ.. గట్టిగానే ప్రచారం చేసుకున్నారు. మధుర ప్రజలు ఆమెను మళ్లీ ఆశీర్వదిస్తారా లేదా.. అనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు.
ఆ సంగతలా ఉంటే.. హేమమాలిని సవతి తనయుడు సన్నీ డియోల్ కు ఇప్పుడు బీజేపీ ఎంపీ టికెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. పంజాబ్ నుంచి సన్నీ డియోల్ ను పోటీ చేయించాలని బీజేపీ అనుకుంటోందట. ఈ మేరకు అమిత్ షాతో సన్నీడియోల్ సమావేశం కూడా జరిగింది.
పంజాబ్ లోని అమృత్ సర్ లేదా గురుదాస్ పూర్ నుంచి సన్నీ డియోల్ ను పోటీ చేయించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోందట. అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు అయినట్టుగా సమాచారం.
సన్నీడియోల్ తండ్రి ధర్మేంద్రకు హేమమాలిని రెండో భార్య అనే సంగతి తెలిసిందే. ధర్మేంద్ర కూడా గతంలో బీజేపీ తరఫున ఎంపీగా వ్యవహరించారు. ఒకసారి మాత్రమే మాత్రమే ఆయన పోటీ చేశారు. ఆయన రాజస్థాన్ నుంచి పోటీ చేయగా - హేమమాలిని యూపీ నుంచి బరిలోకి ఉన్నారు. ఇప్పుడు సన్నీడియోల్ పంజాబ్ నుంచి రంగంలోకి దిగుతూ ఉన్నారు.