Begin typing your search above and press return to search.

లక్ అంటే సన్ రైజర్స్ దే.. ముందడుగేస్తుందా?

By:  Tupaki Desk   |   8 May 2019 4:37 AM GMT
లక్ అంటే సన్ రైజర్స్ దే.. ముందడుగేస్తుందా?
X
ఐపీఎల్ చివరి అంచెకు వచ్చింది. లీగ్ మ్యాచ్ లు ముగిసి ఫ్లే ఆఫ్స్ కు చేరింది.అంటే సెమీస్ పోటీలు జరుగుతున్నట్టు.. మొత్తం 8 జట్లు పోటీపడ్డాయి. తొలి మూడు స్థానాల్లో ముంబై, చెన్నై, ఢిల్లీ నిలిచాయి.. అవి సరిసమానంగా 18 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచాయి. కానీ నాలుగో స్థానంలో నిలిచిన జట్టు ఆటతో రాలేదు.. అదృష్టంతో వచ్చింది.. అదే సన్ రైజర్స్ హైదరాబాద్..

దాదాపు 3 జట్లు 4వ స్థానానికి పోటీపడ్డాయి. కానీ చివరి మ్యాచ్ లలో సన్ రైజర్స్ సహా అన్నీ ఓడిపోయాయి. దీంతో మెరుగైన రన్ రైట్ ఉన్న సన్ రైజర్స్ ఆటతో కాకుండా అదృష్టంతో ప్లే ఆఫ్స్ కు చేరింది...

సన్ రైజర్స్ మెరుగైన రన్ రేట్ సాధించి చివరి మ్యాచ్ లలో ఓడినా ఫ్లే ఆఫ్స్ చేరిందంటే అదంతా ఓపెనర్లుగా వ్యవహరించిన వార్నర్ - బెయిర్ స్ట్రో దయనే.. మే 2లోపు వారు సన్ రైజర్స్ తరుఫున ఆడారు. అనంతరం తమ దేశాలకు వెళ్లి ప్రపంచకప్ సన్నాహకంలో మునిగిపోయారు. మే 2 వరకు బలంగా కనిపించిన సన్ రైజర్స్ జట్టు ఆ తర్వాత బలహీనపడిపోయింది. అసలు బ్యాట్స్ మెన్ లేకుండా పోయారు. పరుగులు చేయడానికి చాలా కష్టమైంది.

ముంబైతో మ్యాచ్ లో హోరాహోరీగా పోరాడి గెలవాల్సిన స్థితిలో టై చేసుకుంది. సూపర్ ఓవర్ లో పరుగులు చేయలేక ఓడిపోయింది. బలమైన బ్యాట్స్ మన్ లేక బౌలర్ అయిన నబిని సూపర్ ఓవర్ లో దించారంటే సన్ రైజర్స్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమితో గెలుపు అంచనాలు లేని స్థితిలో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరింది. కోల్ కతా టీం ముంబైపై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరేది. కానీ ఓడిపోయింది. మంచి రన్ రేట్ మెయింటేన్ చేసిన సన్ రైజర్స్ నెత్తిన పాలు పోసింది.

ఇప్పుడు వార్నర్ - బెయిర్ స్టో లేక చతికిలపడ్డ సన్ రైజర్స్ కు కెప్టెన్ విలయం సన్ దిక్కు. మరి ఈరోజు రాత్రి ఢిల్లీతో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే ముందంజ వేస్తుంది.. లేదంటే ఇంటిదారి పడుతుంది. అదృష్టంతో ఫ్లే ఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. ఆటతో ఫైనల్ చేరుతుందా లేదా అనేది వేచిచూడాలి.