Begin typing your search above and press return to search.

సన్ స్ర్కీన్లతో ‘అసలు’కే దెబ్బంట బాస్

By:  Tupaki Desk   |   3 April 2016 10:30 PM GMT
సన్ స్ర్కీన్లతో ‘అసలు’కే దెబ్బంట బాస్
X
ముఖానికి క్రీములు రాసేసి.. పౌడర్లు పూసేయటం ఆడాళ్ల పని. మగాళ్లకు అలాంటివేంటన్న రోజులు పోయి చాలానే కాలమే అయ్యింది. అందం ఎవరికైనా అందమే. దానికి మగాళ్లు. తేడాళ్లు అన్న తేడా ఏమీ లేదన్న ట్రెండ్ వచ్చేసి కొన్ని సంవత్సరాలైంది. సామాజికంగా వచ్చిన మార్పులతో సౌందర్య సాధనాలు ఆడాళ్లకు మాదిరే.. మగాళ్లకు భారీగానే వచ్చేశాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మగాడి చర్మం కందిపోకుండా ఉండేందుకు.. మసక బారకుండా ఉండేందుకు చాలానే మార్కెట్లోకి వచ్చేశాయి.

మేకప్ సామాగ్రితో పాటు మాయిశ్చరైజర్లు.. లిప్ బామ్ లు అతిగా వాడేస్తున్న పురుష పుంగవులు ఈ డిజిటల్ ప్రపంచంలో చాలామందే కనిపిస్తారు. అంతాబాగుంది కానీ.. తాజాగా చేసిన ఒక పరిశోధన ఫలితం షాకింగ్ గా మారటమే కాదు.. సౌందర్య సాధనాల మీద ప్రేమను పటాపంచలు చేసేలా చేసే షాకింగ్ ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది.

అదేమంటే.. సన్ స్ర్కీన్ లోషన్లు.. లిప్ బామ్ లు.. మాయిశ్చరైజర్లు తరచూ వినియోగించే మగాళ్లకు నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉందన్న తాజా కబర్. అతినీల లోహిత కిరణాలను ఫిల్టర్ చేసే కొన్ని రసాయనాల కారణంగా నంపుసకత్వ ప్రమాదం ఉందని.. వీటిని వినియోగించటం వల్ల వీర్య కణాల నాణ్యతపై ప్రభావం చూపిస్తాయని డెన్మార్క్ కు చెందిన కోపెన్ హెగన్ వర్సిటీ తేల్చింది. సో.. అందం లేకుంటే ఫర్లేదు.. అసలుకే మోసం రాకూడదు కదా. మగాళ్లు.. పారాహుషార్.